Smart LPG Cylinder : ముందే తెలుస్తుంది, బరువూ తగ్గుతుంది.. గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్

గ్యాస్‌ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియక అంతా టెన్షన్ పడుతుంటారు. ఉన్నట్టుండి సిలిండర్ ఖాళీ అయిపోతుంది. రెండో సిలిండర్ ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే మాత్రం తిప్పలే. అంతేకాదు గ్యాస్ సిలిండర్ బరువు భారీగా ఉంటుంది. మోయలేక అవస్థలు పడుతుంటారు. అయితే ఇకముందు అలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే

Smart LPG Cylinder : ముందే తెలుస్తుంది, బరువూ తగ్గుతుంది.. గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్

Smart Lpg Cylinder

Smart LPG Cylinder : గ్యాస్‌ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియక అంతా టెన్షన్ పడుతుంటారు. ఉన్నట్టుండి సిలిండర్ ఖాళీ అయిపోతుంది. రెండో సిలిండర్ ఉంటే నో ప్రాబ్లమ్. లేకపోతే మాత్రం తిప్పలే. అంతేకాదు గ్యాస్ సిలిండర్ బరువు భారీగా ఉంటుంది. మోయలేక అవస్థలు పడుతుంటారు. అయితే ఇకముందు అలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో ముందే తెలిసిపోతుంది. అంతేకాదు గ్యాస్‌ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది.

తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్‌ ఎల్‌పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్‌ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఐఓసీఎల్‌ విడుదల చేసిన స్మార్ట్‌ సిలిండర్లతో గ్యాస్‌ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా గ్యాస్‌ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా ఐఓసీఎల్‌ రిలీజ్‌ చేసిన స్మార్ట్‌ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్‌డీపీఈ)తో తయారు చేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది. ఈ నిర్మాణంతో స్టీల్‌ సిలిండర్లు మాదిరి స్మార్ట్‌ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ఇంట్లో స్టీల్‌ సిలిండర్లతో ఎదురయ్యే తుప్పు సమస్యలకు ఇక కాలం చెల్లనుంది.

ఈ స్మార్ట్ సిలిండర్లను ఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలోని 5 కిలోలు, 10 కిలోల పరిమాణాలలో ఎంపిక చేసిన పంపిణీదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్‌ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా లభిస్తాయని ఐఓసిఎల్ తెలిపింది.