IPL 2021: ఢిల్లీ ఫీల్డింగ్.. అశ్విన్ స్థానంలో ఇషాంత్

గత మ్యాచ్ పరాభవంతో మరో మ్యాచ్ కు రెడీ అయింది బెంగళూరు. వాంఖడే వేదికగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా దెబ్బకి తేలిపోయిన బెంగళూరు.. ఏకంగా 69 పరుగుల తేడాతో ఓడి..

IPL 2021: ఢిల్లీ ఫీల్డింగ్.. అశ్విన్ స్థానంలో ఇషాంత్

Dc Vs Rcb (1)

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో బెంగళూరు వర్సెస్ ఢిల్లీకి సమయం ఆసన్నమైంది. ఒత్తిడిలో కనిపిస్తున్న ఈ ఇరు జట్లు అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా మంగళవారం ఢీ కొనబోతున్నాయి.

గత మ్యాచ్ పరాభవంతో మరో మ్యాచ్ కు రెడీ అయింది బెంగళూరు. వాంఖడే వేదికగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా దెబ్బకి తేలిపోయిన బెంగళూరు.. ఏకంగా 69 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదే రోజు చెపాక్‌లో సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ క్లిష్టంగా మార్చుకుని.. ఆఖరికి సూపర్‌ ఓవర్లో గెలుచుకుని ఊపిరి పీల్చుకుంది.

ఐపీఎల్‌లో బెంగళూరు, ఢిల్లీ టీమ్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఆశ్చర్యకరంగా గత రెండు సీజన్లలోనూ కనీసం ఒక్కసారి కూడా ఢిల్లీని బెంగళూరు ఓడించలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీనే గెలుపొందడం విశేషం.

Royal Challengers Bangalore: Virat Kohli(c), Devdutt Padikkal, Rajat Patidar, Glenn Maxwell, AB de Villiers(w), Washington Sundar, Daniel Sams, Kyle Jamieson, Harshal Patel, Yuzvendra Chahal, Mohammed Siraj

Delhi Capitals: Prithvi Shaw, Shikhar Dhawan, Rishabh Pant(w/c), Steven Smith, Shimron Hetmyer, Marcus Stoinis, Axar Patel, Amit Mishra, Kagiso Rabada, Ishant Sharma, Avesh Khan