రైల్వే స్టేషన్లలో మీల్స్, బ్రేక్ ఫాస్ట్ కొత్త ధరలు ఇవే

  • Published By: sreehari ,Published On : December 24, 2019 / 01:00 PM IST
రైల్వే స్టేషన్లలో మీల్స్, బ్రేక్ ఫాస్ట్ కొత్త ధరలు ఇవే

రైల్వే స్టేషన్లలో స్టాటిక్ యూనిట్లపై అందించే ప్రామాణిక మీల్స్‌పై టారిఫ్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ మేరకు భారతీయ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎక్స్ ప్రెస్/మెయిల్ రైళ్లలో సవరించిన మెనూతో పాటు ప్రామాణీక భోజనాల టారిఫ్స్‌కు సంబంధించి నోటిఫికేషన్‌లో పేర్కొంది.

రీఫ్రెష్ మెంట్ రూమ్స్, జన్ ఆహార్ వంటి స్టాటిక్ యూనిట్లలోని ప్రామాణిక మీల్స్, మెనూ, టారిఫ్ ధరలను సవరించినట్టు తెలిపింది. ఈ మీల్స్ టారిఫ్ లపై IRCTC పరీక్షించగా, ఎక్స్ ప్రెస్/మెయిల్ ట్రైన్లలో సర్వీసుల వారీగా సవరించిన టారిఫ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. 

1. సర్వీసుల వారీగా సవరించిన టారిఫ్స్ :
వెజ్ బ్రేక్ ఫాస్ట్ : రూ.35
నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ : రూ.45
స్టాండర్డ్ వెజ్ మీల్ : రూ.70
స్టాండర్డ్ మీల్ (ఎగ్ కర్రీ) రూ. 120
వెజ్ బిర్యానీ (350గ్రాములు) రూ. 70
ఎగ్ బిర్యానీ (350గ్రాములు) రూ. 80
చికెన్ బిర్యానీ (350గ్రాములు) రూ. 100
స్నాక్ మీల్ (350 గ్రాములు) రూ. 50
 
2. పైన పేర్కొన్న రేట్లు అన్నీంటికి GSTతో కలిపి సవరించనవిగా గుర్తించాలి.

3. జంతా మీల్స్ మెనూ, టారిఫ్స్, స్టాండర్డ్ మెనూతో పాటు ఇతర మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లలో అమలు చేయడం వంటి అన్ని ఇతర సూచనలు స్టాటిక్ యూనిట్లకు కూడా వర్తిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ సర్కిలర్‌లో పేర్కొంది.

4. ఐఆర్ సీటీసీ, జోనల్ రైల్వేల్లో టారిఫ్ ధరలు పెంచడ వల్ల నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తనిఖీలు కూడా నిర్వహించడం జరుగుతుంది.

5. ఈ టారిఫ్ సవరణ అనేది సర్వీసు ప్రొవైడర్లకు ఎలాంటి లబ్ది చేకూరదు. మరోవైపు బీఎస్ఈలో IRCTC షేర్లు స్వల్పంగా రూ.864.50 దగ్గర నమోదయ్యాయి.

రాజధాని, శతాబ్ది, దొరంతో రైళ్లలోని టారిఫ్స్ :
* AC ఫస్ట్ క్లాసులో బ్రేక్ ఫాస్ట్ ధర రూ.140
* AC సెకండ్ క్లాసులో బ్రేక్ ఫాస్ట్ ధర రూ.105
* AC మూడో క్లాసులో బ్రేక్ ఫాస్ట్ ధర రూ.105

లంచ్, డిన్నర్ ధరలు :
* AC ఫస్టులో రూ.245 చెల్లించాలి
* AC సెకండ్ క్లాసులో రూ. 185 చెల్లించాలి.
* AC మూడో క్లాసులో రూ.185

సాయంత్రం పూట టీ ధరలు :
* AC ఫస్ట్ క్లాసులో రూ. 140
* AC సెకండ్ క్లాసులో రూ. 90
* AC థర్డ్ క్లాసులో రూ. 90

* దొరంతో రైళ్లలోని స్లీపర్ క్లాసులో ప్రయాణించేవారు బ్రేక్ ఫాస్ట్ కు రూ.65, లంచ్/డిన్నర్ కు రూ.120, సాయంత్రం పూట టీ కోసం రూ.50 వరకు చెల్లించాల్సి ఉంటుంది.