IRCTC Ladakh Tour Package : ఏడు రోజుల లడఖ్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్​సీటీసీ

IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది

IRCTC Ladakh Tour Package : ఏడు రోజుల లడఖ్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్​సీటీసీ

Ladakh (1)

IRCTC Ladakh Tour Package                         IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆరు రాత్రులు మరియు ఏడు రోజుల లడఖ్ టూరిజం ప్యాకేజీ ఒక వ్యక్తికి రూ. 32,000 నుంచి ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్ నుంచి టూర్ ప్రారంభమవుతుందని గురువారం IRCTC ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 10 వరకు అహ్మదాబాద్ నుంచి ఐఆర్ సీటీసీ ప్యాకేజీ ద్వారా లడఖ్ టూర్ కి వెళ్లవచ్చు. ఇక,ముంబై నుంచి కూడా ఈ ప్యాకేజీ ఉంటుంది. ముంబై నుంచి లేహ్ ప్రయాణం ఇండిగో విమానం ద్వారా ఉంటుందని ఐఆర్ సీటీసీ తెలిపింది.

టూర్ వివరాలు ఇలా
మొదటి రోజు: లేహ్ చేరుకోవడం
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ పి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదే రోజు లడఖ్ కి చేరుకుంటారు. తొలి రోజు సిటీ మార్కెట్ సహా నగరంలోని పలు ప్రాంతాల సందర్శన ఉంటుంది. ఈ రోజు రాత్రి లేహ్ లో నే బస ఉంటుంది.
రెండో రోజు:లేహ్-షామ్ వ్యాలీ-లేహ్(75 కి.మీ,2గంటల వన్ వే ప్రయాణం)
అల్పాహారం తర్వాత లేహ్-శ్రీనగర్ హైవేపై ఉన్న పర్యాటక ప్రదేశాల సందర్శన. హాల్ ఆఫ్ ఫేమ్(భారత ఆర్మీ అభిృద్ధి చేసిన మ్యూజియం),కాలీ మందిర్ టెంపుల్,గురుద్వారా పథార్ సిహిద్(భారత ఆర్మీ నిర్మించిన మరియు నిర్వహిస్తున్న గురుద్వారా),శాంతి స్థూప మరియు లేహ్ ప్యాలెస్,మ్యాగ్నెటిక్ హిల్,ఇండస్,జంస్కర్ ప్రాంతాల సందర్శన ఉంటుంది. అల్చీ,లిఖిర్ గ్రామాల సందర్శన తర్వాత రాత్రికి తిరిగి లేహ్ కి చేరుకొని అక్కడ బస చేస్తారు.
మూడో రోజు : లేహ్-నుబ్రా
అల్పాహారం తర్వాత లేహ్ నుంచి కార్దుంగ్ లా పాస్ లా మీదుగా నుబ్రా వ్యాలీకి చేరుకుంటారు. కార్దూంగ్ లా పాస్ చుట్టూ ఉన్న పర్వత శ్రేణుల అందాల వీక్షణ తర్వాత క్యాంప్ కి చేరుకుంటారు. మధ్యాహ్నా భోజనం తర్వాత దీక్షిత్,హండర్ గ్రామాలను సందర్శిస్తారు. సాయంత్రం కేమల్ సఫారీ(ఒంటపై సఫరీ)ఉంటుంది. రాత్రికి నుబ్రా వ్యాలీ చేరుకొని అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు : నుబ్రా-తుర్తుక్-నుబ్రా
అల్పాహారం తర్వాత 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ గెల్చుకున్న తుర్తుక్ గ్రామాన్ని సందర్శిస్తారు. తర్తుక్ వ్యాలీ అందాల వీక్షణ తర్వాత నుబ్రా చేరుకుంటారు. రాత్రికి నుబ్రాలోనే బస చేస్తారు. పాంగాంగ్ సరస్సు సందర్శన ఉంటుంది. పాంగాంగ్ సరస్సు చుట్టు పక్కల ఉన్న అందాలను వీక్షించి రాత్రికి పాంగాంగ్ లోనే బస చేస్తారు.
ఐదో రోజు : నుబ్రాయ వ్యాలీ-పాంగాంగ్
రోజంతా పాంగాంల్ లేక్,దాని చుట్టుపక్కల ప్రాంతాల సందర్శన. రాత్రికి పాంగాంగ్ లోనే బస ఉంటుంది.
ఆరో రోజు : పాంగాంగ్-లేహ్ వయా చెంగ్లా
పాంగాంగ్ సరస్సు ఉదయం సూర్యోదయాన్ని చూసి తిరిగి లేహ్ కి చేరుకుంటారు. మార్గమధ్యలోని కొన్ని ముఖ్యమైన ప్లేస్ ల సందర్శన.రాత్రికి లేహ్ లోనే బస ఉంటుంది.
ఏడో రోజు : లేహ్ ఎయిర్ పోర్ట్ డ్రాప్
అల్పాహారం తర్వాత లేహ్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లి అహ్మదాబాద్ విమానం ఎక్కుతారు. ఈ రోజుతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీలో ఉండేది
షేరింగ్ పద్ధతిలో నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్. లేహ్ (3 రాత్రులు), నుబ్రా (2 రాత్రులు) మరియు పాంగోంగ్ (1 రాత్రి) వద్ద బాగా నియమించబడిన గదులలో వసతి. ఆరు రోజులు- అల్పాహారం,మధ్యాహ్నా భోజనం,రాత్రి డిన్నర్. ట్రావెల్ ఇన్సయూరెన్స్.ఇన్నర్ లైన్ పర్మిట్స్, ఆల్చి మఠం హెమిస్ మరియు తిక్సే మొనాస్టరీ ప్రవేశ రుసుము. రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు గైడ్. నుబ్రా వ్యాలీలో సాంస్కృతిక ప్రదర్శన. అత్యవసర ప్రయోజనం కోసం వాహనంలో ఆక్సిజన్ సిలిండర్. పర్యటన సమయంలో IRCTC యొక్క టూర్ ఎస్కార్ట్ సేవలు. టోల్, పార్కింగ్ మరియు పన్నులు

ప్యాకేజీలో లేనివి ఏంటీ

అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకునేందు ఎలాంటి వాహనం ఏర్పాటు చేయబడదు. నుబ్రా వ్యాలీలో ఒంటెల సఫారీ ఫీజు పత్ర్యేకంగా చెల్లించాలి. హోటల్ లో టిప్స్.ఫోన్ ఛార్జీలు,లాండ్రీ చార్జీలు పర్యాటకులు సొంతంగా చెల్లించాల్పిందే. వీడియో కెమెరా ఫీజు. స్మారక కట్టడాల ప్రవేశ రుసుం చెల్లించాలి. ఐటీనరీలో సూచించిన ఏవైనా కార్యకలాపాల కోసం ప్రత్యక్షంగా నగదు వసూలు ఉంటుంది.
ఐటినరీలో పేర్కొన్నవి కాకుండా ఏదైనా అదనపు భోజనం, మార్గంలో భోజనం, సందర్శనా మరియు కార్యకలాపాల కోసం ప్రత్యకంగా చెల్లించాలి.