Indian Railway New Year Gift..ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ వెరీ ఈజీ..ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు

Indian Railway New Year Gift..ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ వెరీ ఈజీ..ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు

IRCTC Website revamp tickets booking easy : రైల్వే శాఖ ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక నుంచి రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకోవటానికి మరింత ఈజీ చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులు కూడా టిక్కెట్ రిజర్వ్ చేసుకోవటానికి లైన్లలో నిలబడి గంటల తరబడి టైమ్ వేస్టు చేసుకోకుండా ఆన్ లైన్ బుకింగ్ లు ఆన్‌లైన్‌వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రైల్వే శాఖ కూడా ప్రయాణీకుల సౌకర్యార్థం టిక్కెట్ల బుకింగ్ ను మరింత ఈజీ చేసింది.

ఐఆర్‌సీటీసీ బుకింగ్ వెరీ ఈజీ
కొత్త సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శుభవార్త చెబుతూ..క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్‌ను గురువారం (డిసెంబర్ 31,2020) 12 గంటలకు అప్ గ్రేడ్ చేశారు. వెబ్‌సైట్‌ అప్‌గ్రేడ్ వల్ల ప్రయాణికులు మరింత ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల ట్రెయిన్ టికెట్లను చాలా ఫాస్టుగా బుక్ చేసుకోవచ్చని..బుకింగ్ సామర్థ్యం కూడా పెంచుతున్నామని తెలిపారు.

టిక్కెట్ తో పాటు ఫుడ్ కూడా బుక్ చేసుకునే సౌకర్యం
కొత్త వెబ్‌సైట్ ద్వారా ట్రెయిన్ టికెట్‌‌తో పాటు ట్రైన్ జర్నీలో తినే ఫుడ్ ను కూడా బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించామని అధికారులు తెలిపారు. టిక్కెట్ల బుకింగ్‌లో మోసాలు, నకిలీ ఏజెంట్ల జోక్యానికి చెక్ పెట్టటానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ను వినియోగదారులకు మరింత అనుకూలంగా మార్చడానికి రైల్వే ప్రయత్నిస్తోంది. డిజిటల్ ఇండియా ప్రభావంతో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఇండియన్ రైల్వే అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ప్రయాణీకుల సౌకర్యం కోసం కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేశారు.

సైట్ హ్యాంగ్ అవ్వదు..నగదు చెల్లింపుకు మోర్ ఆప్షన్స్
వైబ్‌సైట్‌లో చేసిన మార్పులతో సామర్ధ్యం పెరుగుతుంది. సైట్ హ్యాంగ్ కావటమనేదే ఉండదు. ఒకేసారి ఎక్కువ మంది టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో బుకింగ్ ఒత్తిడి వల్ల వెబ్‌సైట్ క్రాష్‌ అయ్యే అవకాశం ఏమాత్రం ఉండదు. తర్వాత ప్రయాణికుల నగదు చెల్లింపు కోసం మరిన్ని ఆప్షన్లు చేర్చనున్నారు.

ఇక, 2014 నుంచి టిక్కెట్ల బుకింగ్, సౌకర్యాలను మెరుగుపరచడానికి రైల్వే శాఖ అత్యధికగా ప్రాధాన్యత ఇస్తోంది. భారతీయ రైల్వేలో ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్న అనుభవం, స్నేహపూర్వకంగా..సౌకర్యవంతంగా ఉండాలని రైల్వే మంత్రి ఆకాంక్షించారు.