IRCTC Website Shut : కొత్త ఫీచర్ల కోసమే?

  • Published By: madhu ,Published On : March 6, 2019 / 12:44 PM IST
IRCTC Website Shut : కొత్త ఫీచర్ల కోసమే?

రైళ్లలో వెళుతున్నారా ? బుకింగ్ చేయాలని అనుకుంటున్న వారికి ఈ న్యూస్. IRCTC Website పనిచేయడం లేదు. మార్చి 5 తేదీ అర్ధరాత్రి 12గంటలు అంటే 06వ తేదీ బుధవారం క్లోజ్ అయ్యింది. 07వ తేదీ ఇలాగే ఉండనుంది. ఈ టైంలో ఎలాంటి టికెట్ బుక్సింగ్స్ ఉండవు. అలాగే ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ కూడా చేసుకొనే ఛాన్స్ ఉండదని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 30గంటల పాటు వెబ్ సైట్ పనిచేయదన్నమాట. 

భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది IRCTC వెబ్ సైట్‌ని ఆశ్రయిస్తుంటారు. ప్రధానంగా రైల్ రిజర్వేషన్ అత్యధికంగా ఉపయోగించుకుంటుంటారు. అలాగే క్యాన్సిల్ కూడా చేసుకుంటారు. పెరుగుతున్న టెక్నాలజీకి తోడు IRCTC వెబ్ సైట్‌ని ఛేంజెస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి మార్పులు చేశారు కూడా. తాజాగా మరికొన్ని ఫీచర్స్ అందుబాటులోకి తేవాలని IRCTC వెబ్ సైట్‌ అధికారులు భావించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం IRCTC మెయింటెనెన్స్ చేయాల్సి రావడంతో సుమారు 30 గంటల పాటు సేవలను నిలిపివేసింది. రైళ్లలో ఎలాంటి ఖాళీలున్నాయో తెలిపే ఫీచర్ అందుబాటులోకి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది.