Maharashtra politics crisis : అదే షిండేకు ఆయుధంగా మారిందా?శివసేనలో తిరుగుబాటుకు అదే కారణమైందా?

ఎక్కడ ఎలా.. ఏది అనుకొని ప్రయాణం మొదలుపెట్టారో.. ఇప్పుడా సిద్ధంతాలా లేవు. ఉద్ధవ్ ఠాక్రే విషయంలో శివసైనికులు అంటున్న మాట ఇది. బాల్‌ ఠాక్రే నుంచి ఉద్ధవ్ వరకు.. పార్టీలో జరిగిన మార్పులు ఏంటి.. శివసేన సైనికులు ఏమనుకుంటున్నారు. ఇంతకీ పార్టీ పయన ఎలా సాగబోతోంది..

Maharashtra politics crisis : అదే షిండేకు ఆయుధంగా మారిందా?శివసేనలో తిరుగుబాటుకు అదే కారణమైందా?

Maharashtra Politics Crisis (1)

Maharashtra politics crisis : ఎక్కడ ఎలా.. ఏది అనుకొని ప్రయాణం మొదలుపెట్టారో.. ఇప్పుడా సిద్ధంతాలా లేవు. ఉద్ధవ్ ఠాక్రే విషయంలో శివసైనికులు అంటున్న మాట ఇది. బాల్‌ ఠాక్రే నుంచి ఉద్ధవ్ వరకు.. పార్టీలో జరిగిన మార్పులు ఏంటి.. శివసేన సైనికులు ఏమనుకుంటున్నారు. ఇంతకీ పార్టీ పయన ఎలా సాగబోతోంది..

శివసేన అంటే… కరడుగట్టిన హిందుత్వ పార్టీ అని జనాల్లోకి తీసుకెళ్లారు బాల్ ఠాక్రే ! ఐతే ఆ టెంపో కంటిన్యూ చేయడంలో ఉద్ధవ్ విఫలం అయ్యారు. మతం, రాజకీయాన్ని ముటి పెట్టడం తాము చేసిన పెద్ద తప్పంటూ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు తోడు.. కరోనా సమయంలో జరిగిన పరిణామాలు.. శివసైనికుల్లో చర్చకు దారి తీశాయ్. కరోనా పరిణామాల సమయంలో ఆలయాలను పూర్తిగా మూసివేయడం.. శివసైనికుల్లో భిన్నాభిప్రాయాలకు కారణం అయింది. కాంగ్రెస్‌ దోస్తీ కట్టడంతోనే ఒకరకమైన చర్చ మొదలవగా.. వరుసగా జరిగిన పరిణామాలతో పార్టీలో అసంతృప్తి రేగింది. చివరికి ఇప్పుడు షిండే రూపంలో తిరుగుబాటుకు దారి తీసే పరిస్థితులకు కారణం అయిందన్న చర్చ జరుగుతోంది.

Also read :Maharashtra politics crisis : బాల్‌ ఠాక్రే బాటలో షిండే..శివసేన పరిస్థితి ఏంటి..?!

పార్టీ మీద నియంత్రణ కోల్పోవడం కూడా ఉద్ధవ్‌కు ఈ పరిస్థితి తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. పార్టీని నడుపుతున్న సమయంలో.. లీడ్ చేసేవాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. పార్టీ శ్రేణులపై పట్టు కలిగి ఉంటూనే… ఇతర పార్టీల కుయుక్తులను పసిగట్టాలి. ఐతే ఆ విషయంలో శివసేన వెనకే ఉండిపోయింది. ఉద్ధవ్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టి.. రాష్ట్రంలో చక్రాన్ని కాంగ్రెస్‌-ఎన్సీపీ నేతలు తిప్పుతున్నారన్న విమర్శలు చాలానే ఉన్నాయి. ఇదంతా ఎలా ఉన్నా.. బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే వరకు.. పార్టీ విధించుకున్న నిబంధనల్లో, రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయ్. కాలానికి అనుగుణంగా.. రాజకీయాలకు అనుగుణంగా మారే ప్రాసెస్‌లో పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టారని.. దీంతో పార్టీ మీద పట్టు కోల్పోయారని.. అదే ఇప్పుడు షిండేకు ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది.

ఉద్ధవ్ ఠాక్రేకు ముందు… ఠాక్రే కుటుంబంలోని ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. పదవులను స్వీకరించడానికి బాల్‌ఠాక్రే విరుద్ధం. తాను ఉన్నప్పుడు అధికారం అందినా మనోహర్ జోషి, నారాయణ్ రాణేను ముఖ్యమంత్రులను చేశారు తప్ప.. నేరుగా సీఎం సీట్లో బాల్‌ఠాక్రే కూర్చోలేదు. చివరకు అప్పట్లో పార్టీలో చక్రం తిప్పిన సోదరుడు కుమారుడు రాజ్‌ ఠాక్రేను కూడా ప్రభుత్వానికి దూరంగానే ఉంచారు. కానీ ప్రభుత్వాన్ని నడిపించే రిమోట్ కంట్రోల్‌ను తన దగ్గరే పెట్టుకున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టాక ఉద్ధవ్ ఠాక్రే కొంతకాలం అవే సిద్ధాంతాలకు కట్టుబడ్డా.. కొడుకు కోసం క్రమంగా తన పద్ధతి మార్చుకున్నారు. ఆదిత్య ఠాక్రేను ఎన్నికల బరిలోకి దింపారు. ఇది అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అంతటితో ఆగలేదు… బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్‌-ఎన్సీపీతో జట్టు కట్టాక నేరుగా సీఎం పదవిలో ఉద్ధవ్‌ కూర్చుకున్నారు.. తనకొడుకును మంత్రిని చేసుకున్నారు.. ఆ సమయంలో ఏక్‌నాథ్ షిండే సీఎం పదవిని ఆశించారు. కానీ.. పవార్‌ పట్టుబట్టారన్న కారణం చూపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఉద్ధవ్‌. అప్పుడు మొదలైన అసంతృప్తి ఇప్పుడు తిరుగుబాటుకు కారణం అయింది.

Also read : Maharashtra political crisis: వీడని ఉత్కంఠ.. దూకుడు పెంచిన బీజేపీ.. అడ్డుకొనేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు

బాల్‌ ఠాక్రే ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనుకులేదు. ఆయన పొలిటికల్ స్టైల్‌ చాలా భిన్నంగా ఉండేది. 90ల తర్వాత దేశంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయ్. హిందుత్వవాద ప్రభుత్వాలు రావడం మొదలైంది. వారితో పొత్తు పెట్టుకుని.. శివసేన అధికారానికి దగ్గరగా వచ్చింది. శివసేన నుంచి ఇద్దరు సీఎంలుగా చేశారు. నిజానికి అధికారానికి బాల్‌ ఠాక్రే బయట ఉన్నా.. ఆయన పవర్ సెంటర్‌గా ఉండేవారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ఠాక్రే ఏది చెబితే, అదే జరిగేది. అధికారంలో కూర్చున్న వ్యక్తి… బాల్ ఠాక్రే మాట వినకపోయినా, ఆయన అభిమానులు చాలామంది తమదైన పద్ధతిలో ఆ నేత మాట వినేలా చేసేవారు. ఐతే 1967లో శివసేన ఎలా పనిచేసేదో.. 2019లో అలా చేయలేకపోయింది. అధికార పీఠానికి తన కుటుంబం దూరంగా ఉండాలన్న బాల్ ఠాక్రే సిద్ధాంతాన్ని దూరం చేసింది. ఇదే ఇప్పుడు అస్తిత్వానికి దెబ్బగా మారుతోంది.

నిజానికి 2019లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో.. శివసైనికులు అవాక్కయ్యారు. మూడు దశాబ్దాలు తాము ఎవరితో పోరాడామో వారితో పొత్తు పెట్టుకోవడాన్ని డైజెస్ట్ చేసుకోలేక పోయారు. అందులో ఏక్‌నాథ్ షిండే ఒకరు ! నిజానికి బాల్‌ ఠాక్రేను జనాలు ఎంత అభిమానించేవారో.. అంతే భయపడేవారు కూడా ! ఐతే ఉద్ధవ్ దగ్గర అలాంటిదేం లేదు. వేరే నేతల రిమోట్ కంట్రోల్ ఉద్ధవ్‌ దగ్గర ఏదీ లేదు. రాజకీయాలను తన ఇష్టప్రకారం నడిపించాలి అంటే సీఎం పదవి ఉండాలి అనుకున్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ తర్వాత పార్టీ మీద పూర్తిగా నియంత్రణ కోల్పోయారు. దీంతో క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరు పొందిన శివసేన… ఇప్పుడు నిలువునా చీలిపోయే పరిస్థితులకు చేరుకుంది.

Also read : Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం

బాల్‌ఠాక్రే ఉన్న సమయంలో ఆయన మాటలు తూటాల్లా దూసుకు వచ్చేవి. ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కు తిరగడమన్నది జరగలేదు. ఐతే ఉద్ధవ్‌ వైఖరి పూర్తిగా భిన్నం. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో దిట్ట అయినా… శివసేన సహజమైన దూకుడు వైఖరి లేకపోవడం ఒక మైనస్‌. బాల్‌ ఠాక్రే అన్న పేరు.. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయంలో మరోసారి చర్చకు వస్తోంది. ధైర్యమైన నిర్ణయం అంటే.. సీఎం బిల్డింగ్ ఖాలీ చేసి రావడం కాదు.. పార్టీని తిరిగి క్రమశిక్షణలో పెట్టడం.. దానికి ఉద్ధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి.. అసలు పార్టీ ఠాక్రే కుటుంబం చేతుల్లో ఉంటుందా లేదా అన్న అనుమానం.. దేశ రాజకీయాల్లో వినిపిస్తోంది.