Mentally ill Man: “నీ పేరు మొహమ్మదా..” అంటూ మానసికరోగిపై దాడి, హత్య

మానసిక రోగంతో తప్పిపోయిన వ్యక్తిని హత్య చేశారని తెలియడంతో ఆ కుటుంబం లబోదిబోమంటుంది. మధ్యప్రదేశ్‌లో 65 ఏళ్ల వ్యక్తిని నీ పేరు మొహ్మద్.. ఆ అని అడగడం పదేపదే అతనిపై దాడిచేయడం వీడియోలో రికార్డ్ అయింది. నీముచ్ జిల్లాలో నమోదైన ఘటనపై కేసు నమోదైంది.

Mentally ill Man: “నీ పేరు మొహమ్మదా..” అంటూ మానసికరోగిపై దాడి, హత్య

Chittoor Murder Case

 

Mentally ill Man: మానసిక రోగంతో తప్పిపోయిన వ్యక్తిని హత్య చేశారని తెలియడంతో ఆ కుటుంబం లబోదిబోమంటుంది. మధ్యప్రదేశ్‌లో 65 ఏళ్ల వ్యక్తిని నీ పేరు మొహ్మద్.. ఆ అని అడగడం పదేపదే అతనిపై దాడిచేయడం వీడియోలో రికార్డ్ అయింది. నీముచ్ జిల్లాలో నమోదైన ఘటనపై కేసు నమోదైంది.

వీడియోలో దాడి చేసిన వ్యక్తిని దినేష్ కుష్వాహగా గుర్తించి, ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ భర్తనే ఈ కుష్వాహా.

రత్లాం జిల్లాలోని సర్సీకి చెందిన భన్వర్‌లాల్ జైన్ అనే వృద్ధుడు, మే 15న రాజస్థాన్‌లో మతపరమైన కార్యక్రమానికి వెళ్లి తర్వాత అదృశ్యమయ్యాడని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ ఫిర్యాదుతో, పోలీసులు అతని ఫోటోలతో వెతుకుతుండగా.. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం అతనిదేనని గుర్తించి ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు.

Read Also : ఇది రాజకీయ హత్యే.. బీజేపీ కార్యకర్త మృతిపై సీబీఐ విచారణ జరపాలి : అమిత్ షా డిమాండ్

మిస్టర్ జైన్ బెంచ్‌పై కూర్చున్నట్లు కుష్వాహ అతనిపై దాడి చేస్తున్నట్లు వీడియోలో రికార్డ్ అయింది. “మీ పేరు ఏమిటి? మొహమ్మద్?” అతను వృద్ధుడిని అడిగాడు. ముఖానికి అడ్డంగా కొట్టాడు. “మీ పేరు సరిగ్గా చెప్పు. ఆధార్ కార్డు చూపించు” అని బెదిరించాడు. .
.
వృద్ధుడు అని చూడకుండా ఆ వ్యక్తిని తల, చెవులపై దాడిచేస్తూనే ఉన్నాడు. 65 ఏళ్ల వృద్ధుడు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నట్లు కనిపించాడు. తనను ముస్లిం అనే అనుమానంతో కొడుతున్నారని తెలియక చొక్కా ఎత్తి దాచి ఉంచిన డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ గట్టిగా కొడుతూనే ఉన్నాడు.

రిలీజ్ అయిన వీడియో ఆధారంగా జైన్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కుష్వాహాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి కెఎల్‌ డాంగి మాట్లాడుతూ, ఈ వీడియో గురువారం రికార్డ్ అయినది అయి ఉండొచ్చని అంటున్నారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ వీడియో బయటకు రావడంతో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై విరుచుకుపడ్డాయి. ఈ ఘటన దురదృష్టకరమని, నిందితుడు నిందితుడేనని, దానికి పార్టీ రాజకీయాలతో సంబంధం లేదని, అలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెట్టబోదని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రజనీష్ అగర్వాల్ అన్నారు.