Amritpal Singh: ఖలిస్తాన్ నేత అమృపాల్ సింగ్‭కు ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నట్లు అనుమానాలు

అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‭వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు

Amritpal Singh: ఖలిస్తాన్ నేత అమృపాల్ సింగ్‭కు ఐఎస్ఐ నుంచి నిధులు వస్తున్నట్లు అనుమానాలు

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటు వాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత పాల్ సింగ్‭కు పాకిస్తాన్‭కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటలీజెన్స్ (ఐఎస్ఐ) నుంచి నిధులు వస్తున్నట్లు జాతీయ భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అమృత్‭సర్ నగరంలోని అజ్ణాలా పోలీస్ స్టేషన్ మీద అమృతపాల్ అనుచరులు దాడి చేసిన మర్నాడే ఈ సమాచారం అందినట్లు సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియాలో తనకు తాను భింద్రన్‭వాలాగా ప్రచారం చేసుకున్న అమృతపాల్ మీద కొద్ది రోజుల క్రితం నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Lok Sabha Secretariat: బీఆర్ఎస్‭కు షాక్ ఇచ్చిన లోక్‭సభ సచివాలయం

తన అనుచరుడు లవ్‌ప్రీత్ తూఫాన్‭ను ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడిని విడుదల చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమృతపాల్ హెచ్చరించి 24 గంటలు కూడా గడవకముందే వందలాది మంది కత్తులు, పదునైన ఆయుధాలతో పోలీస్ స్టేషన్ మీదకు దాడికి వచ్చారు. ఈ దాడికి బెదిరిపోయిన యంత్రాంతం.. తూఫాన్‭ను విడుదల చేసింది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని ధంధం తస్కల్ సహా కాంగ్రెస్ పార్టీ విమర్శించాయి. అజ్ణాలా ఘటనపై దర్యాప్తుకు శిరోమణి గురుద్వారా కమిటీ కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

BRS Party: బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రెటరీగా తివారీ.. మహారాష్ట్ర డివిజన్ కో-ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్

అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‭వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. చాలా మంది అతడు మతప్రచారం చేస్తున్నాడని భ్రమిస్తారు. అయితే మొదట్లో అమృత్‌పాల్‌ వ్యాఖ్యలు, చేష్టలపై ఎక్కువ వ్యతిరేకత ఉండేది. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది అది తగ్గి, మద్దతు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మద్దతు ఇవ్వకపోయినా అమృతపాల్ రాడికల్ చర్యల వల్ల చాలా మంది వ్యతిరేకించడానికి భయపడి మౌనం పాటించాల్సి వస్తోంది.

Amritpal Singh: మళ్లీ పైకి లేస్తోన్న ఖలిస్తానీ ఉద్యమం.. భింద్రన్‭వాలా 2.0గా అమృతపాల్ సింగ్!

ఇక కేంద్ర హోంమంత్రికీ అమృతపాల్ హత్యా బెదిరింపులు చేశారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను గుర్తు చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయాలనుకుంటే దానికి తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని హెచ్చరించారు. హిందూ రాష్ట్ర డిమాండ్ చేసేవారిని అణచివేస్తారా అని అమిత్ షాను ప్రశ్నించారు. అలా చేస్తే హోంమంత్రిగా ఎంత కాలం ఉంటారో మేమూ చూస్తాం అంటూ అమృతపాల్ వ్యాఖ్యానించారు.