ISRO Chandrayan-3 : జూలై నాటికి చంద్రునిపైకి చంద్రయాన్-3.. సురక్షిత ల్యాండింగ్‌పై దృష్టిపెట్టామన్న ఇస్రో చైర్మన్

చంద్రయాన్-3ను విజయవంతంగా చంద్రుడిపైకి ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. తద్వారా మిగిలిన ప్రక్రియ ప్రణాళికాబద్దంగా కొనసాగుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు.

ISRO Chandrayan-3 : జూలై నాటికి చంద్రునిపైకి చంద్రయాన్-3.. సురక్షిత ల్యాండింగ్‌పై దృష్టిపెట్టామన్న ఇస్రో చైర్మన్

ISRO

ISRO Chandrayan-3 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 2022లో కొత్త పరిమితులకు చేరుకుంది. 2023 సంవత్సరంకూడా ఇస్రోకు అతిపెద్ద సంవత్సరంగా నిలవనుంది. ఇస్రో చంద్రునిపైకి చంద్రయాన్-3 ప్రయోగంకోసం అన్ని సహాన్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్ -3ని విజయవంతంగా చంద్రునిపైకి ప్రయోగించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా చంద్రునిపై అంతరిక్ష నౌకను సురక్షితంగా ల్యాండింగ్ చేయడంపైనే మా దృష్టి కేంద్రీకరించినట్లు ఇస్రో చైర్మన్ అన్నారు.

ISRO Launches 36 Satellites: ఇస్రో ఖాతాలో మరో విజయం.. 36 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం2 రాకెట్

చంద్రయాన్-3ను విజయవంతంగా చంద్రుడిపైకి ల్యాండ్ చేయడమే ప్రధాన లక్ష్యం. తద్వారా మిగిలిన ప్రక్రియ ప్రణాళికాబద్దంగా కొనసాగుతుందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్ 3లో చంద్రయాన్ 2 ఆర్బిటర్ ను ఉపయోగించనున్నామని, ఇదిచాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. చంద్రయాన్-3కూడా చంద్రయాన్-2 తరహాలోనే ఉండబోతోందని, కానీ, ఈసారి ల్యాండర్ రోవర్, ప్రొపల్షన్ సిస్టమ్‌తో పాటు సాప్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురావడం నుంచి కొత్త సెన్సార్‍‌లను జోడించడం వరకు ఇస్రో ఈసారి ఎటువంటి అవకాశాన్ని విదిలిపెట్టడం లేదని చెప్పారు.

Mission Prarambh: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్.. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ -3 ప్రయోజగం ఈ ఏడాది ప్రారంభించడంపై ఇస్రో నమ్మకంగా ఉందని, సాధారణంగా జూన్, జులై నెలల్లో అందుబాటులో వస్తుందని, అవసరమైన పరీక్షలన్నీ పూర్తయ్యాయని తెలిపారు. రాకెట్ సామర్థ్యాన్ని బట్టి మనం మంచిరోజులు ఎంచుకొని లాంఛ్ చేయాలని సోమనాథ్ చెప్పారు. మరోవైపు ఇస్రో ఇప్పటికే తన భారీ లాంచర్ GSLV Mk IIIని ప్రయోగానికి సిద్ధం చేసింది.