Chandrayaan-2 : కీలక సమాచారం.. క్రోమియం, మాంగనీస్‌ గుర్తింపు

చంద్రయాన్ -2.. రెండేళ్ల క్రితం భారత్ చేసిన ప్రయోగం. చంద్రయాన్-2 అంతరిక్ష నౌక గురించి ఇస్రో కీలక విషయాలు వెల్లడించింది. చంద్రయాన్ -2 స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటివరకూ చంద్రుడి చుట్టూ 9వేల

Chandrayaan-2 : కీలక సమాచారం.. క్రోమియం, మాంగనీస్‌ గుర్తింపు

Chandrayaan 2

Chandrayaan-2 : చంద్రయాన్ -2.. రెండేళ్ల క్రితం భారత్ చేసిన ప్రయోగం. చంద్రయాన్-2 అంతరిక్ష నౌక గురించి ఇస్రో కీలక విషయాలు వెల్లడించింది. చంద్రయాన్ -2 స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటివరకూ చంద్రుడి చుట్టూ 9వేల ఆర్బిట్స్ పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. అంతేకాదు రిమోట్ సెన్సింగ్ ద్వారా క్రోమియం, మాంగనీస్ మైనర్ ఎలిమెంట్లను గుర్తించినట్లు చెప్పారు.

చంద్రయాన్-2 ప్రయోగానికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో బెంగళూరులో రెండు రోజుల పాటు లూనార్ సైన్స్‌పై ఇస్రో వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. సోమవారం(సెప్టెంబర్ 6) ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ కె. శివన్ మాట్లాడారు.

WhatsApp End : ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎప్పటినుంచో తెలుసా?

అంతరిక్ష నౌకలోని సాంకేతిక టెక్నాలజీతో చంద్రుడి ఉపరితలానికి సంబంధించి కీలక డేటా అందుతోందని తెలిపారు. చంద్రయాన్-2లోని అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ చంద్రుడి ఉపరితలం నుంచి 100కి.మీ ఎత్తు వరకు ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తోందని శివన్ వెల్లడించారు. ఈ మిషన్‌కు సబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లను వర్క్‌షాపులో విడుదల చేశారు. చంద్రయాన్-1తో పోల్చితే చంద్రయాన్ 2 టెక్నాలజీ మరో స్థాయిలో ఉందని ఇస్రో అపెక్స్ సైన్స్ బోర్డు ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. చంద్రుడి ఉపరితలంపై అబ్జర్వేషన్ల విషయంలో చంద్రయాన్ 2 పనితీరు అద్భుతంగా ఉందన్నారు.

చంద్రయాన్ 2లోని అన్ని పరికరాలు, సబ్ సిస్టమ్స్ అద్భుతంగా పని చేస్తున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత తెలిపారు. రాబోయే చాలా ఏళ్ల పాటు చంద్రయాన్ 2 నుంచి మంచి డేటా అందుతుందని ఆశిస్తున్నామన్నారు.

Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

రెండు రోజుల పాటు బెంగళూరులో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌ను ఇస్రో వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. అలాగే ఇస్రో ఫేస్‌బుక్ పేజీలోనూ లైవ్ వీక్షించవచ్చు. అంతరిక్ష పరిశోధనల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు.. వారికి ఈ విషయాలను చేరువ చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.

జులై 22, 2019న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ ఎంకే3-ఎం1 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. చంద్రయాన్-2లో మూడు పరికరాలను అమర్చారు. ఆర్బిటర్, ల్యాండర్, ల్యాండర్ రోవర్ ఇందులో ఉన్నాయి. ఇందులో ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది. దీని నుంచి ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరం చంద్రుడి మీద అన్వేషణ సాగిస్తుంది.