ISRO Ventilators : కరోనా పోరులో ఇస్రో.. 3 రకాల అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తోంది..!

కరోనా సెకండ్ వేవ్ పై పోరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రంగంలోకి దిగింది. అత్యాధునిక టెక్నాలజీతో మూడు రకాల వెంటిలేటర్లను ఇస్రో తయారుచేసింది.

ISRO Ventilators : కరోనా పోరులో ఇస్రో.. 3 రకాల అత్యాధునిక వెంటిలేటర్లు అందిస్తోంది..!

Isro Develops 3 Types Of Ventilators To Transfer Technology

ISRO develops 3 types of ventilators : కరోనా సెకండ్ వేవ్ పై పోరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రంగంలోకి దిగింది. అత్యాధునిక టెక్నాలజీతో మూడు రకాల వెంటిలేటర్లను ఇస్రో తయారుచేసింది. తక్కువ ధరతో పాటు పొర్టబుల్ క్రిటికల్ కేర్ వెంటిలేటర్లను Prana (Programmable Respiratory Assistance for the Needy Aid) పేరుతో అభివృద్ధి చేసింది. అంబు (ఆర్టిఫిషియల్ మాన్యువల్ బ్రీతింగ్ యూనిట్) ఆధారంగా ఈ వెంటిలేటర్లు పనిచేయనున్నారయి. ఇందులో అత్యాధునిక కంట్రోల్ సిస్టమ్ ఎయిర్ వే ప్రెజర్ సెన్సార్లను కలిగి ఉంది. ఫ్లో సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, సర్వో యాక్టివేటర్ ఉన్నాయి.

PEEP అనే కంట్రోల్ వాల్వ్స్ కూడా ఉన్నాయని బెంగళూరు స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అవసరమైన సమయాల్లో ఈ వెంటిలేటర్లను వాడేందుకు మోడ్ సెటప్ ఏర్పాటు చేసినట్టు పేర్కంది. టచ్ స్ర్కీన్ ప్యానెల్ ద్వారా ప్రెజర్, ఫ్లో, టిడల్ వాల్యూమ్, ఆక్సిజన్ కాన్సిసెంట్రేషన్ ఒకే స్ర్కీన్ పై మానిటరింగ్ చేసుకోవచ్చు. ఈ వెంటలేటర్ల ద్వారా పేషెంట్ కు అవసరమైన ఆక్సిజన్ ఫ్లో రేటును పంపు చేసేలా సెట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా బ్యాటరీ కూడా అమర్చారు.

పవర్ ఫెయిల్యూర్ అయిన సమయంలో బ్యాకప్ తీసుకునేందుకు వీలుగా డిజైన్ చేశారు. రోగి నియంత్రిత సురక్షితమైన వెంటిలేషన్ కోసం బలమైన అల్గోరిథం అమలు చేయనుంది. దీనికి ఒక అలారం అమర్చారు. వెంటిలేషన్ సమయంలో బారోట్రామా, అస్ఫిక్సియా అప్నియాను నివారించడంలో పనిచేస్తుంది. క్రిటికల్ మెడికల్/ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ మూడు వెంటిలేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని పిఎస్‌యులు / పరిశ్రమలు / స్టార్టప్‌లకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.