ISRO : నింగిలోకి GSLV-F10 రాకెట్‌..ఆకాశంలో ఇస్రో కన్ను

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV-F10 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు.

ISRO : నింగిలోకి GSLV-F10 రాకెట్‌..ఆకాశంలో ఇస్రో కన్ను

Isro

GSLV-F10 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV-F10 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. కొన్ని సెకన్లలోనే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది GSLV-F10.
EOS-03 అనేది అత్యాధునిక చురుకైన ఉపగ్రహం.

Read More : Child Reporter : ఏడేళ్ల బాలుడి లైవ్‌ రిపోర్టింగ్‌.. సీఎం ఫిదా

దీనిని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ఉంచుతారు. భూమిపై 36 వేల కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది GSLV-F10. ఆ తర్వాత ఉపగ్రహం దాని ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ని ఉపయోగించి తుది జియోస్టేషనరీ కక్ష్యకు చేరుకుంటుంది. భవిష్యత్ లో జరగబోయే ప్రకృతి వైపరిత్యాలను ముందే పసిగట్టే వీలుంది. భారత భూ పరిశీలన ఉపగ్రహాల్లో దీనిని కీలకంగా భావించవచ్చు. దీనిని గత సంవత్సరం మార్చిలోనే ప్రవేశపెట్టాలని అనుకున్నా…కరోనా కారణంగా..ప్రయోగం రెండుసార్లు వాయిదా పడింది.