ఇస్రో స్పెషల్ మిషన్ : PSLV కొత్త రాకెట్‌లో 30 శాటిలైట్లు

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది.

  • Published By: sreehari ,Published On : February 28, 2019 / 02:10 PM IST
ఇస్రో స్పెషల్ మిషన్ : PSLV కొత్త రాకెట్‌లో 30 శాటిలైట్లు

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది.

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) స్పెషల్ మిషన్ కు సిద్ధమవుతోంది. మార్చిలో కొత్త PSLV కొత్త రాకెట్ ను లాంచ్ చేయనుంది. DRDO సంబంధించి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఎమిశాట్ ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ లో దాదాపు 30 థర్డ్ పార్టీ శాటిలైట్లు గగనతలంలోకి దూసుకెళ్లనున్నాయి. కొత్త వేరియంట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ ను ఇస్రో మార్చిలో ప్రయోగించనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు కొత్త టెక్నాలజీతో కూడిన శాటిలైట్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. పీఎస్ఎల్ వీ రాకెట్ లాంచింగ్ అయ్యే కచ్చితమైన తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించలేదు.
Read Also : నన్ను ఎవడూ.. ఏమీ పీకలేరు : బిగ్ బాస్ కౌశల్ ఉగ్రరూపం

‘ఈ ప్రయోగం.. మాకు స్పెషల్ మిషన్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి నాలుగు మోటార్లను వాడుతున్నాం. 28 థర్డ్ పార్టీ శాటిలైట్లను తొలిసారి మూడు వివిధ స్థాయి కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నాం’ అని ఇస్రో చైర్మన్ కె. శివన్ చెప్పారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ)కు సంబంధించిన డిఫెన్స్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఎమిశాట్, పీఎస్ఎల్వీ రాకెట్ ను ప్రయోగిస్తున్నట్టు తెలిపారు.

శాటిలైట్ 420 కేజీల బరువు ఉంటుందన్నారు. తమ కస్టమర్లకు సంబంధించిన 28 శాటిలైట్లు కలిపి మొత్తం బరువు 250 కేజీలు ఉంటుందని శివన్ చెప్పారు. డీఆర్ డీఓ ఎమిశాట్ అనేది ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ గా శివన్ తెలిపారు.  పీఎస్ఎల్వీ ఎమిశాట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించిన తర్వాత 76 కిలోమీటర్లు వరకు ప్రయాణించి 28 శాటిలైట్లను 504 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ప్రవేశపెట్టనుంది. 
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి

పీఎస్ఎల్వీ శాటిలైట్ తో పాటు మరో రెండు డిఫెన్స్ శాటిలైట్లను ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కొత్త రాకెట్ ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ద్వారా లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. గత జనవరిలో ఇస్రో డీఆర్ఢీఓ కోసం మైక్రో శాట్ ఆర్ అనే ఇమేజింగ్ శాటిలైట్ ను లాంచ్ చేసింది.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి