ఇస్రో పీఎస్ఎల్వీ సీ-50 సీఎంఎస్-01 శాటిలైట్ లాంచింగ్

ఇస్రో పీఎస్ఎల్వీ సీ-50 సీఎంఎస్-01 శాటిలైట్ లాంచింగ్

ISRO PSLV C-50 CMS-01 satellite: ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్ చేసింది. బుధవారం మధ్యాహ్నం 14:41 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన శాటిలైట్‌ను 15గంటల 41నిమిషాలకు ప్రయోగించనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా బయల్దేరనుంది.

పీఎస్ఎల్వీ-50/సీఎమ్ఎమ్01 మిషన్ కు కౌంట్ డౌన్ మొదలైందని 14గంటల 41నిమిషాలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరి కోట వేదికగా ప్రకటించింది. 1410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం.. 2011లో ప్రారంభించిన జీశాట్‌-12 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను రిప్లేస్‌ చేయనుంది. ఈ ఉపగ్రహంలో ఎక్సెంటెడ్‌ -‌సీ బాండ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం ఉపకరణాలను అమర్చి పంపుతున్నారు.

ఈ శాటిలైట్‌ ఇండియాతో పాటు అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులు, లక్షద్వీప్‌ ‌లాంటి దీవులకు కమ్యూనికేషన్ సేవలను అందించనుంది.. ఏడేళ్ల పాటు ఈ ఉపగ్రహం తన సేవలను అందించనుంది. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

ఈ ప్రయోగాన్ని డిసెంబర్‌ 7నే చేపట్టాలని మొదట ప్లాన్ చేశారు.. కానీ వాతావరణం అనుకూలించక డిసెంబర్‌ 8కు వాయిదా వేశారు.. అప్పుడు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో డిసెంబర్‌ 14కు లాంచ్ డేట్‌ను మార్చారు.. కానీ చివరికి గురువారం మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు రాకెట్‌ ను నింగిలోకి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.

ఇస్రోకు ఇది 42వ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ లాంచ్ ప్రయోగం.. CMS-01 శాటిలైట్‌ 42 వేల 164 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరగనుంది.. భూమి ఎంత వేగంతో తిరుగుతుందో.. ఈ ఉపగ్రహం కూడా అంతే వేగంగా భూమి చుట్టు తిరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీనిని నింగిలోకి చేర్చడానికి ఇస్రో శాస్త్రవేత్తలు PSLV -XL రాకెట్‌ను ఉపయోగిస్తున్నారు. PSLV కేటగిరిలో ఇది 52వ ప్రయోగం కాగా.. XL కేటగిరిలో ఇది 22వది.. ఇక మొత్తంగా ఇస్రోకు ఇది 77వ రాకెట్‌ ప్రయోగం. ఇప్పటి వరకూ 104 దేశీయ, 32 దేశాలకు చెందిన 234 ఉపగ్రహాలు, 10 స్టూడెంట్‌ ‌శాటిలైట్‌ను ఇస్రో అంతరిక్షానికి చేర్చింది.. ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి.. మరోసారి సత్తా చాటుతామంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.