Water Molecules On Moon : చంద్రుడిపై నీటి అణువుల జాడ కనబడింది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే.

Water Molecules On Moon : చంద్రుడిపై నీటి అణువుల జాడ కనబడింది

Moon

Water Molecules On Moon భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ భూమి వైపు క‌న‌పించ‌ని చంద్రుడి భాగంపై అధ్య‌య‌నం చేయ‌డానికి ఈ మిష‌న్‌ను లాంచ్ చేశారు. అయితే చివ‌రి నిమిషాల్లో రోవ‌ర్ చంద్రుడి ఉప‌రితలంపై కుప్ప‌కూలింది. అయితే చంద్రుడిపై దిగే సమయంలో రోవర్ కూలిపోయినా ఇందులోని ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూ కీలక సమాచారాన్ని భూమికి పంపిస్తూనే ఉంది.

తాజాగా చంద్ర‌యాన్‌ 2 ఆర్బిట‌ర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీట‌ర్ (ఐఐఆర్ఎస్‌).. చంద్రుడి ఎల‌క్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్ర‌మ్ నుంచి సేక‌రించిన డేటాను పంపించింది. తాజాగా చంద్రయాన్ 2 ఆర్బిటర్ లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్‌ఎస్) చంద్రుడి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ నుంచి సేకరించిన డేటాను పంపించింది. చంద్రుడిపై ఉన్న ఖనిజ మిశ్రమాల గురించి తెలుసుకోడానికి ఈ సమాచారం ఉపయోగపడతుంది. ఈ ఐఐఆర్‌ఎస్ సెన్సర్ లోని డేటాని విశ్లేషించనప్పుడు చంద్రుడిపై హైడ్రాక్సిల్, నీటి అణువుల జాడ కనిపించింది.

ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను కరెంట్ సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. చంద్రుడిపై 29 నుంచి 62 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య నీటి జాడలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా చంద్రుడి పై అక్షాంశాల్లోని సూర్య‌కిర‌ణాలు ఎక్కువ‌గా ప‌డే ప్రాంతాల్లో ఈ హైడ్రాక్సిల్‌, నీటి జాడ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు కూడా తేలింది. అయితే,సౌరగాలులు చంద్రుడి ఉపరితలాన్ని తాకినప్పుడు ఇలా హైడ్రాక్సిల్, నీటి అణువులు ఏర్పడే అవకాశం ఉందని డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ తెలిపింది.