PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం

Pslv C53

PSLV C53: పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ 26గంటల పాటు కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

PSLV-C 52 రాకెట్ ప్రయోగం సక్సెస్

న్యూస్పేస్ ఇండియా వాణిజ్యపరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ- సీ53 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.

Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్

ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్‌ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.