సన్ మిషన్, గగనయాన్ టెస్ట్…ఇస్రో 2020 టార్గెట్స్ ఇవే

  • Published By: venkaiahnaidu ,Published On : December 26, 2019 / 02:19 PM IST
సన్ మిషన్, గగనయాన్ టెస్ట్…ఇస్రో 2020 టార్గెట్స్ ఇవే

2020కి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది భారత అంతరిక్ష సంస్థ(ISRO). కొత్త శిఖరాలను అధిరోహించాలని నిర్ణయించిన ఇస్రో వచ్చే ఏడాది డజనకు పైగా ముఖ్యమైన శాటిలైట్ లను లాంఛ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆదిత్య(సన్)మిషన్ కూడా ఉంది.

10కి పైగా శాటిలైట్ మిషన్లను రానున్న సంవత్సరంలో లాంఛ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. అందులో అత్యాధునిక సమాచార శాటిలైట్లు జీశాట్1,జీశాట్-12R,భూమి పరిశీలన ఉపగ్రహాలు రిశాట్-2BR2 అండ్ మైక్రోసాఫ్ట్(నిఘా)కూడా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆదిత్య L1(సన్)మిషన్ ను 2020 మధ్యలో లాంఛ్ చేయాలని, గగనయాన్ యెక్క మానవరహిత టెస్ట్ ఫ్లైట్ ను వచ్చే ఏడాది డిసెంబర్ లో లాంఛ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఆదిత్య L1 మిషన్ దేశం యొక్క మొట్టమొదటి సౌర మిషన్ అవుతుందని శివన్ తెలిపారు. ఇది సౌర కాంతివలయాలను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుందన్నారు. అంతరిక్ష నౌకను తీసుకువెళ్ళడానికి ఒక పిఎస్ఎల్వి ఉపయోగించబడుతుంది, దానిపై పని జరుగుతోందని ఇస్రో చీఫ్ తెలిపారు.