PM Modi: మంచి పనులకు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం

కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: మంచి పనులకు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం

Pm Modi (1)

PM Modi: కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.. దేశ పౌరుల సంక్షేమంకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే అవి రాజకీయ రంగు పులుముకోవటం మన దేశ దురదృష్టకరం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్మించిన ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడువను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నయా భారతదేశం అన్ని సమస్యలను పరిష్కరించుకుంటుందని తెలిపారు. అయితే కేంద్రం తీసుకుంటున్న పలు ప్రధాన నిర్ణయాలు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే దేశం వేగంగా అభివృద్ధిలో పయణించేందుకు కొంత ఆటంకం ఏర్పడుతుందని అన్నారు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

ఇదిలాఉంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున హింసలు చెలరేగాయి. అంతేకాక మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేశారు. దీంతో కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.

Crude oil prices: ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి ఏమని లేఖ రాశాయి..

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై పలు రాష్ట్రాల్లో యువత నిరసనలు తెలిపారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టాయి. ఈ క్రమంలో అగ్నపథ్ పథకంపై సైన్యం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుంది.