కల్కి ఖజానా: గుట్టలుగా బయటపడుతున్న నోట్ల కట్టలు

కల్కి ఖజానా: గుట్టలుగా బయటపడుతున్న నోట్ల కట్టలు

కల్కి ఆశ్రమంలో గుట్టలుగుట్టలుగా నోట్లు దర్శనమిచ్చాయి. ఐటీ అధికారుల సోదాల్లో ఈ డబ్బులు బయటపడ్డాయి. నాలుగు రోజులుగా కల్కి ఆశ్రమంలో జరిపిన దాడుల్లో బయటపడ్డ సొమ్మును అధికారికంగా విడుదల చేశారు. కోట్ల రూపాయల్లో ఉన్న డబ్బుల వీడియా

40మంది అధికారులు, 16చోట్లు నాలుగు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. 43.9కోట్ల ఇండియన్ కరెన్సీ 18కోట్ల విదేశీ కరెన్సీని సీజ్ చేశారు. తిరుపతిలోని వరదయ్య ఆశ్రమమా.. లేక చెన్నైలోని నుంగంబాకం ఆశ్రమమా అనేది అధికారులు స్పష్టం చేయలేదు. 

నోట్ల రూపంలో మాత్రమే ఈ సొమ్ము కనిపిస్తుండగా అక్రమాస్తులు మొత్తం కలిపి రూ.500కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. పలు చోట్ల సోదాలు ముగిసినప్పటికీ చెన్నైలో ఇంకా ముగియలేదు. తవ్విన కొద్దీ అక్రమాస్తులు, నగదు బయటపడుతుండటంతో సోదాలు కొనసాగుతోంది. 

రూ.60కోట్లకు పైగా నగదు బయటపడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఐటీ అధికారులు ఇంకా నగదు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆశ్రమాల్లో దొరికిన 1600 డాక్యుమెంట్లను సేకరించారు. వీటి ఆస్తులు వేల కోట్లలో ఉండొచ్చని అధికారులు అంచనా. సోదాలు కొనసాగుతున్నందున మరో వారం రోజుల్లో వివరాలు పూర్తిగా బయటపడొచ్చని చెబుతున్నారు.