IT Raids In Tamilnadu : తమిళనాడు మంత్రి ఇంట్లో ఐటీ దాడులు .. అధికారుల వాహనాలపై రాళ్లదాడి

డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కరూర్ జిల్లాలో ఐటీ అధికారులను డీఏంకే కార్యకర్తలు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.

IT Raids In Tamilnadu : తమిళనాడు మంత్రి ఇంట్లో ఐటీ దాడులు .. అధికారుల వాహనాలపై రాళ్లదాడి

Tamilnadu Minister Senthil Balaji

Tamilnadu Minister Senthil Balaji  : తమిళనాడులో ఐటీ అధికారులు ఏకకాలంలో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా తమిళనాడు మంత్రి (DMK) సెంథిల్ బాలాజీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కరూర్ జిల్లాలో ఐటీ అధికారులను డీఏంకే కార్యకర్తలు అడ్డుకుని అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేశారు.

మంత్రి నివాసం కార్యాలయంతో పాటు ఐటీ అధికారులు ఆయనకు సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, బంధువుల నివాసాలల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే కారూర్‌ జిల్లాలోని మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్‌ ఇంటికి కూడా సోదాల కోసం వెళ్లగా అక్కడ డీఎంకే కార్యకర్తలు అధికారులను అడ్డుకున్నారు. అయినా అధికారులు కార్యకర్తలను దాటుకుని లోపలికి వెళ్లే యత్నం చేశారు.దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కార్యకర్తలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాపని మమ్మల్ని చేసుకోనివ్వండీ అని అధికారులు కోరారు. అయినా కార్యకర్తలు వినిపించుకోలేదు. అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఏకంగా ఐటీ అధికారులపై ఇలా దాడులు చేయటం హాట్ టాపిక్ గా మారింది.