చెన్నైలో IT దాడులు : 15 కోట్ల క్యాష్ స్వాధీనం

వరుస IT దాడులతో తమిళనాడు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల్లో భారీగా డబ్బు..కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 05:42 AM IST
చెన్నైలో IT దాడులు : 15 కోట్ల క్యాష్ స్వాధీనం

వరుస IT దాడులతో తమిళనాడు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల్లో భారీగా డబ్బు..కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

వరుస IT దాడులతో తమిళనాడు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల్లో భారీగా డబ్బు..కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల సీజన్‌లో దాడులు జరుగుతుండడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఏప్రిల్ 13వ తేదీ శనివారం నమ్మక్కల్‌లో ఉన్న PSK ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. కంపెనీతో పాటు మూడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. అట్టపెట్టెలు, బ్యాగుల్లో ఉన్న 14 కోట్ల 54 లక్షల డబ్బును సీజ్ చేశారు. 
Read Also : ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని ​​​​​​​

ప్రభుత్వంచే గుర్తింపు పడిన అనేక వర్క్స్ PSK ఇంజనీరింగ్ కంపెనీ చేపడుతోంది. పెద్ద ఎత్తున భవనాలు, రహదారుల నిర్మాణాలు చేస్తోంది. దీనికి యజమాని పెరియర్ స్వామి. ఇతని కుమారులు సంస్థకు చెందిన వ్యవహాలను చూస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారనే అభియోగం ఉండడంతో ఐటీ అధికారులు దాడులు జరిపినట్లు సమాచారం. పట్టుబడిన 14 కోట్ల 54 లక్షలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. సంస్థకు చెందిన రికార్డ్స్‌ను సీజ్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
Read Also : ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్