Congress Vs BJP: ఇందిర హయాంలోనే మైనారిటీలపై మొదట బుల్డోజర్ దాడులు జరిగాయి, మర్చిపోయారా: బీజేపీ నేత
బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ.."మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ,

Congress Vs BJP: జాతీయ రాజకీయాల్లో ‘బుల్డోజర్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో బీజేపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ..చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. “2వ ప్రపంచయుద్ధ కాలంలో యూదులకు వ్యతిరేకంగా నాజీల వలె భాజపా ప్రభుత్వం దేశ ప్రజలపై బుల్డోజర్లను ఉపయోగిస్తోంది” అంటూ ఇటీవల ఒక వ్యాసంలో మనీష్ తివారీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తివారీ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ..”మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా?..యూదులు, నాజీల సంగతి వదిలేయండి..అసలు భారత్ లో మైనార్టీలను అణచివేసేందుకు మొదట బుల్డోజర్లు ఉపయోగించింది ఇందిరా గాంధీ కాదా?” అని మాలవీయ ప్రశ్నించారు.
Also Read:Mahinda Rajapaksa : ఆర్థిక సంక్షోభంలో లంక.. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా తప్పదా?
ఇందిరా గాంధీ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలోని తుర్కమెన్ గేట్ వద్ద మైనార్టీలపై బుల్డోజర్లతో దాడులు చేశారని.. మాలవీయ గుర్తుచేశారు. “కాంగ్రెస్ పార్టీలో మనీష్ తివారీ నుండి రాహుల్ గాంధీ వరకు ప్రతి ఒక్కరూ మతిమరుపుతో బాధపడుతున్నారా లేదా వారి స్వంత గతం గురించి వారికి తెలియదా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ,” అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశాడు. తుర్క్‌మాన్ గేట్ వద్ద ఆనాడు జరిగిన ఈదాడుల్లో 20 మంది మృతి చెందారని మాలవీయ వివరించారు. అందుకు సంబందించిన ఒక పాత ఫోటోను సైతం మాలవీయ ట్వీట్ కి జత చేశారు.
Also read:Navneet Vs Thakrey: మరోసారి చిక్కుల్లో ఎంపీ నవనీత్ కౌర్.. మళ్లీ జైలుకు తప్పదా?
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో రాహుల్ గాంధీ మేనమామ సంజయ్ గాంధీ చేసిన మితిమీరిన చర్యల గురించి కూడా ఈసందర్భంగా మాలవీయ ప్రస్తావించారు. “ఏప్రిల్ 1976లో, ఎమర్జెన్సీ సమయంలో, ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, ముస్లిం స్త్రీ పురుషులను సంచరించాలంటూ బలవంతం చేశాడు. దీంతో మైనార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ తుర్క్‌మాన్ గేట్ వద్ద చేరుకోగా వారిని బుల్డోజర్లు చుట్టుముట్టాయి. ఈఘర్షణల్లో 20 మంది మరణించారు. నాజీలతో మొదలైన కాంగ్రెస్ రొమాంటిసిజం ఇందిరా గాంధీ వద్ద ఆపాలి” అని మాలవీయ ధీటుగా బదులిచ్చారు.
In April 1976, during Emergency, Sanjay Gandhi, son of Indira Gandhi, forced Muslim men and women, to undergo forced sterilisation. When they protested, bulldozers were rolled in at Turkman Gate. 20 people died.
Congress’s romanticism with the Nazis should stop at Indira Gandhi. https://t.co/lz99puC066
— Amit Malviya (@amitmalviya) May 8, 2022
Also read:Pawan Kalyan Slams Government : వైసీపీ మళ్లీ వస్తే అంధకారమే-పవన్ కళ్యాణ్
- Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్
- CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
- CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
- MP Navneet Rana: అధికార దుర్వినియోగానికి పాల్పడి మాపై దేశద్రోహం కేసు: ఉద్ధవ్ థాకరేపై ఎంపీ నవనీత్ ఫైర్
- Rahul Gandhi: నేపాల్ పబ్‌లో రాహుల్ గాంధీ ఖుషీ ఖుషీ: దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నేతలు
1Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
2Redmi Note 11 SE : భారీ బ్యాటరీతో రెడ్మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
3Ministers Bus Yatra : నేటి నుంచి మంత్రుల బస్సుయాత్ర..శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు
4George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
5CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
6Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
7Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
8Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
9McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
10VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
-
Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
-
CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
-
Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!