Rahul Gandhi: అదానీని మోదీ కాపాడుతున్నారని స్పష్టమైంది: రాహుల్

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ప్రధాని మోదీ ప్రభుత్వం కాపాడుతున్నట్లు స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటులో రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిరోజు గందరగోళం నెలకొంటున్నప్పటికీ దీని గురించి మోదీ మాట్లాడలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Rahul Gandhi: అదానీని మోదీ కాపాడుతున్నారని స్పష్టమైంది: రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ప్రధాని మోదీ ప్రభుత్వం కాపాడుతున్నట్లు స్పష్టమైందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటులో రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిరోజు గందరగోళం నెలకొంటున్నప్పటికీ దీని గురించి మోదీ మాట్లాడలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తూ… “గౌతమ్ అదానీని ప్రధాని మోదీ కాపాడుతున్నారు. ఇవాళ పార్లమెంటులో మోదీ చేసిన ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఏది ఏమైనా మోదీ తీరు స్పష్టమైంది. గౌతమ్ అదానీ వ్యవహారంపై విచారణ జరపాలన్న విషయంలో మోదీ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. నేను అడిగిన ప్రశ్నలకు కూడా మోదీ సమాధానాలు చెప్పలేదు.

నేనేమీ క్లిష్టతర ప్రశ్నలేమీ అడగలేదు. గౌతమ్ అదానీ మోదీ మిత్రుడు కాకపోతే హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపిస్తామని చెప్పేవారు” అని అన్నారు. కాగా, తమ ప్రభుత్వ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. రాష్ట్రపతి పార్లమెంటులో తన ప్రసంగంతో మనలో స్ఫూర్తిని నింపారని చెప్పారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందని మోదీ అన్నారు. భారత మహిళలకు ముర్ము స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.

Pathaan: పఠాన్ @ వెయ్యి కోట్ల మార్క్.. మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందిగా!