కాశ్మీర్ యువతకు భారీ శుభవార్త : 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు

  • Edited By: veegamteam , August 28, 2019 / 01:48 PM IST
కాశ్మీర్ యువతకు భారీ శుభవార్త : 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌పై ప్రధాని మోడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కాశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌పై ప్రధాని మోడీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాశ్మీర్‌ అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు యువతకు ఉపాధి ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా కాశ్మీర్ లో కొలువుల జాతరకు తెరలేపారు. త్వరలో కాశ్మీర్‌ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 50వేల పోస్టులను భర్తీ చేస్తామని గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం(ఆగస్టు 28,2019) ప్రకటించారు. రానున్న 2, 3 నెలల్లోనే భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు యువత సన్నద్ధం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత గవర్నర్ సత్యపాల్ మాలిక్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. పుకార్లను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎక్కడా కాల్పులు ఘటనలు జరగలేదన్నారు. ఒక్క ప్రాణం కూడా పోలేదని వివరించారు. జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ పునరుద్దరిస్తే పాకిస్తాన్ ఆర్మీకి, ఉగ్రవాదులకు లాభం అన్నారు. అందుకే ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల పెద్ద ఇబ్బందేమీ ఉండదన్నారు. సామాన్యుల కంటే వాటిని ఉగ్రవాదులే ఎక్కువ ఉపయోగిస్తున్నారని గవర్నర్ అన్నారు. టెర్రరిస్టులకి ఇంటర్నెట్ ఒక పదునైన ఆయుధంగా మారిందన్నారు.

లోయలో కల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. ఆ కారణంతోనే మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామన్నారు. కుప్వారా, హంద్వారా జిల్లాల్లో మొబైల్ కనెక్టివిటీని పునరుద్ధరిస్తామన్న గవర్నర్ మాలిక్… మిగతా జిల్లాల్లోనూ త్వరలోనే మొబైల్ సేవలపై ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపారు. ప్రతి కశ్మీరీ ప్రాణం మాకు విలువైనదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం అని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. ఘర్షణలకు పాల్పడిన వారిలో కొందరికి గాయాలు అయ్యాయని, అవి కూడా చిన్నగాయలే అని చెప్పారు. ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

ఉపాధి మార్గం లేకపోవడంతోనే కశ్మీర్ యువత తప్పుడు మార్గంలో వెళ్తోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. డబ్బు కోసమే రాళ్లు విసిరే పనులకు వెళ్తున్నారని, అల్లర్లకు దిగుతున్నారని బయటపడింది. స్థానిక వేర్పాటు వాద సంస్థల నేతలు యువతకు డబ్బిచ్చి వారితో విధ్వంసాలు చేయిస్తున్నాయి. దీంతో ముందుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు అటు వైపు వెళ్లకుండా ఉంటారని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.