J&K Delimitation : జమ్మూలో కొత్తగా ఆరు,కశ్మీర్ లో ఒకటి..డీలిమిటేషన్ ప్రతిపాదనపై రగడ

జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ఏర్పాటైన మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని క‌మిషన్ ఇవాళ తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది.

J&K Delimitation : జమ్మూలో కొత్తగా ఆరు,కశ్మీర్ లో ఒకటి..డీలిమిటేషన్ ప్రతిపాదనపై రగడ

Kashmir

J&K Delimitation :  జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ఏర్పాటైన మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని క‌మిషన్ ఇవాళ తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది. జమ్ములో అదనంగా 6, కశ్మీర్​లో ఒక స్థానాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది.

ప్రస్తుతం కశ్మీర్​లో 46, జమ్ములో 37 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి అదనంగా జమ్ములో 6, కశ్మీర్​లో 1 అసెంబ్లీ స్థానాన్ని పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. అలాగే ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలు కేటాయించింది. ఇక పాకిస్తాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో 24 సీట్లు ఖాళీగా ఉంటాయ‌ని క‌మిటీ పేర్కొంది. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై తమ అభిప్రాయాలను డిసెంబర్​ 31లోపు తెలపాలని పార్టీలకు కమిషన్​ సూచించింది.

అయితే డీలిమిటేషన్​ కమిషన్​ ప్రతిపాదనను నేషనల్​ కాన్ఫరెన్స్​ సహా పీడీపీ,జేకే ఆప్నీ పార్టీ,పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీ రాజకీయ అజెండాను కమిషన్ అనుసరిస్తోందని ఆరోపించాయి. బీజేపీకి మిత్రపక్షాలుగా భావించే పార్టీలు సైతం.. కమిషన్​ ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. డీలిమిటేషన్​ కమిషన్​ ప్రతిపాదన తమను నిరాశకు గురిచేసిందని నేషనల్​ కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా. జమ్ముకు 6, కశ్మీర్​కు కేవలం ఒకే స్థానం ఇవ్వటం 2011 జనాభా లెక్కల ప్రకారం జరగలేదన్నారు ఒమర్ అబ్దుల్లా. తమ పరిశీలనలోని డేటాకు బదులుగా బీజేపీ అజెండాలోని అంశాలనే కమిషన్ పరిగణనలోకి తీసుకుందని ఆరోపించారు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ రంజన దేశాయ్​ నేతృత్వంలోని డీలిమిటేషన్​ కమిషన్​లో జమ్ముకశ్మీర్​కు చెందిన ఐదుగురు లోక్​సభ సభ్యులు, ఎక్స్​ అఫీషియో సభ్యుడిగా భారత ఎన్నికల ప్రధానాధికారి సుశీల్​ చంద్ర ఉన్నారు. నేషనల్​ కాన్ఫరెన్స్​ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా సహా ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు.

ALSO READ Reliance Scholarships : ఒక్కొక్కరికి రూ.6లక్షలు.. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్… అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ

.