Vaccine Shortage: వ్యాక్సినేషన్ సంఖ్య ఎందుకు తగ్గుతోంది.. – చిదంబరం

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా భయాందోళనలు పుట్టిస్తుండటంతో ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతికేస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్...

Vaccine Shortage: వ్యాక్సినేషన్ సంఖ్య ఎందుకు తగ్గుతోంది.. – చిదంబరం

Chidambaram

Vaccine Shortage: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా భయాందోళనలు పుట్టిస్తుండటంతో ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతికేస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరైన మార్గమని వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాస్త ఆలస్యం చోటు చేసుకుంటుంది.

ఇండియాలో వ్యాక్సిన్ కొరత కారణంగా మే1నుంచి దేశమంతా జరగాల్సిన వ్యాక్సినేషన్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుంది. అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలు సగం మందికిపైగా జనాభాకు టీకాలు పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నాయి. మే 1నుంచి 18 నుంచి 44ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేయడానికి కొరత ఇబ్బందిగా మారిందని ముందుగా 45ఏళ్ల పైబడ్డ వారికి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ వ్యవహారం పట్ల కాంగ్రేస్‌ నేతలు మండిపడుతున్నరు. కాంగ్రెస్‌ లీడర్ రాహుల్‌ గాంధీ కేంద్రం వైఖరిపై పలు సార్లు ఫైర్‌ అయ్యారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దేశంలో వ్యాక్సిన్ల కొరత ఎందుకు పెరుగుతుందంటూ ట్విట్టర్ వేదికగా నెంబర్లతో సహా ప్రశ్నించారు.

రోజూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వ వ్యాక్సిన్ వ్యూహాన్ని ప్ర‌శ్నించారు. ఏప్రిల్ 2 నాటితో పోలిస్తే ప్రస్తుతం రోజూ వేస్తున్నటీకాల సంఖ్య త‌గ్గుతోంద‌నే డేటాను ట్వీట్ చేశారు. ఏప్రిల్ 2న రోజుకు 42 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు వేసిన కేంద్రం శుక్ర‌వారం ఆ సంఖ్య 11.6 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింద‌ని, ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు వస్తోందని ప్ర‌శ్నించారు.

జూలై చివరి నాటికి భారతదేశంలో టీకాల సంఖ్య 51.6 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు.