Jacqueline : రూ.200 కోట్ల స్కామ్..ఈడీ విచారణకు బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్..

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోందా?జాక్వెలిన్ 200 కోట్ల రూపాయల స్కామ్ చేసిందా?మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న క్రమంలో ఈప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

10TV Telugu News

jacqueline fernandez Rs.200 crore money laundering case : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోందా? జాక్వెలిన్ 200 కోట్ల రూపాయల స్కామ్ చేసిందా? ఆమె మరోసారి ఈడీ అధికారులు విచారణకు హాజరైన సందర్భంగా ఈ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. మనీ లాండరింగ్ దోపిడీ కేసులో ఈడీ సెప్టెంబర్ 25న శనివారం నాడు ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని పిలిచారు. దీనికి ఆమె కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇవ్వాలని..అవి కేవలం ఆరోపణలు మాత్రమే వాస్తవాలు కాదని నిరూపించేందుకు యత్నిస్తోంది.

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణకు జాక్వెలిన్ ను అధికారులు పిలిచార‌ని వార్త‌లు హాట్ టాపిక్ అయిన క్రమంలో ఆమె దీనినుంచి బయటపడాలని యత్నిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసు విషయంలో ఆమె సూత్ర‌ధారిగా కాకుండా కేవలం బాధితురాలిగా ఈడీ విచారణకు హాజరుకానుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

కాగా..రూ. 200 కోట్ల స్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి సూత్రధారి అని తేలింది. జాక్వెలిన్ తో చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకొని ఈమెను స్కాంలోకి లాగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె స్కామ్ లో భాగమా? లేక బాధితురాలా? అనే విషయం ఈడీ విచారణలో వెల్లడికానుంది. జాక్వెలిన్ స్కామ్ చేసినవారి వలలో చిక్కకుకుని మోసపోయినట్లుగా తెలుస్తోంది.

కాగా..2017ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన లంచం కేసులో అరెస్ట్ అయిన చంద్రశేఖర్‌ని విచారించగా పలువురి పేర్లు బ‌య‌ట‌పడ్డాయి. అందులో బాలివుడ్ బ్యూటీ జాక్వెలిన్ పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తీహార్ జైలు లోపల నుంచే దాదాపు 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ నడుపుతున్నట్టు చంద్రశేకర్ పై ఆరోపణలున్నాయి. అయితే నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు గతంలో ప్రశ్నించారు. కానీ మరింత క్లారిటీ కోసం మరోసారి విచారణకు పిలిచారు. దీనికి సంబంధించి జాక్వెలిన్ కు సమన్లు జారీ చేయడం ఇప్పుడు బాలివుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.