ముస్లిం విద్యార్థిని తాలిబన్ అన్న జగ్గీ వాసుదేవ్

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 01:20 PM IST
ముస్లిం విద్యార్థిని తాలిబన్ అన్న జగ్గీ వాసుదేవ్

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఓ విద్యార్థిని తాలిబన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగ్గీ వ్యాఖ్యలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగ్గీ ఇస్లామోఫోబియా(ఇస్లాంని ఇష్టపడనివాడు)వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.విద్యార్థుల ఆగ్రహంతో జగ్గీ క్షమాపణలు చెప్పారు.తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ మాట అనలేదంటూ వివరణ ఇచ్చారు.తన వ్యాఖ్యల పట్ల ఫీల్ అయినవారికి క్షమాపణలు తెలిపారు.
Read Also : వికీలీక్స్ వ్యవస్థాపకుడు అరెస్ట్!

యూత్ అండ్ ట్రూత్ సిరీస్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇనిస్టిట్యూట్స్ ని విజిట్ చేస్తున్న జగ్గీ వాసుదేవ్ మార్చి-27,2019న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ కు చెందిన బిలాల్ బిన్ సాధిఖ్  అనే విద్యార్థి,జగ్గీ మధ్య మాటలు కొనసాగుతున్న సమయంలో బిలాల్ తాను జీవితాన్ని,ఒత్తిడిని చూసే విధానం గురించి జగ్గీకి తెలిపారు.మీరు ఈ రాత్రి సమాధి మీద గడపాలి…మీరు ఇక ఏమాత్రం బయట సమయాన్ని గడపరు అని విద్యార్థి జగ్గీతో అన్నారు.

దీనికి జగ్గీ నవ్వతూ…ఇతడు తాలిబనియా అని బిలాల్ ను ఉద్దేశించి అన్నారు.వెంటనే విద్యార్థి బిలాల్ తాలిబనియా అంటే ఏంటని జగ్గీని అడుగగా ఆయన తాలిబన్ అని అన్నారు.దీనికి ఆ విద్యార్థి స్పందిస్తూ తాను తాలిబన్ కాదని తన పేరు బిలాల్ బిన్ సాదిఖ్ అని తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.జగ్గీ వ్యాఖ్యలపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్టూడెంట్ యూనియన్(LSESU) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.జగ్గీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది.

తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ విద్యార్థిని అలా అనలేదని,భారత్ లో అతిగా అత్యుత్సాహం ప్రదర్శించేవారిని తాలిబన్ అంటారని,బిలాల్ అత్యుహాన్ని చూసి అలా అన్నానని అంతేకానీ తన మనసులో ఎటువంటి ఉద్దేశ్యం లేదని జగ్గీ వివరణ ఇచ్చారు.తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే వారి తాను క్షమాపణలు చెబుతున్నానని జగ్గీ అన్నారు.దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే జగ్గీ వివరణను LSESU తోసిపుచ్చింది. 
Read Also : ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత