రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!

రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!

రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!

రంగుల కేళీ హోలీ వేడుకలకు దేశం సిద్ధమైంది. వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొనే సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటే.. మహిళలపై రంగులు చల్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆనందించేటప్పుడు యువతులు, మహిళలపై బలవంతంగా (వారి అనుమతి లేకుండా) రంగులు చల్లితే దాన్ని నేరంగా పరిగణిస్తారు చట్టాలు. కంప్లయింట్ చేస్తే అరెస్ట్ కూడా చేస్తారు. చల్లింది రంగే కదా అని మీరు లైట్ తీసుకోవచ్చు.. చట్టాలు, కోర్టులు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాయి. హోలీ పండుగ వేళ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పోలీసులకు మహిళలు ఎవరైనా కంప్లయింట్ చేస్తే.. నిందితులపై సెక్షన్ 354 కింద చర్యలు చేపడతారు. ఆ నేరం రుజువైతే సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తుంది కోర్టు.
Read Also : ఐపీఎల్ ముంగిట హాఫ్ సెంచరీతో మెప్పించిన రైనా

అలాగే హోలీ వేడుకల పేరుతో మహిళలను బెదిరింపులకు పాల్పడి.. లైంగికంగా ఒత్తిడి చేస్తే 354(ఏ) కింద మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వేడుకల్లో బలవంతంగా మహిళల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తే..354 (బీ) కింద మూడు నుంచి ఏడు సంవత్సరాల శిక్ష, జరిమానా వేస్తారు. హోలీ ఆడే మహిళలను ఫొటోలు తీయడం లాంటి పనులు చేస్తే 354 (సీ) కింద ఒకటి నుంచి మూడు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. సో హోలీ వేడుకలు సంప్రదాయబద్దంగా..సంతోషంగా జరుపుకోవాలే తప్ప పండుగ పేరుతో మహిళలపై వేధింపులకు పాల్పడితే రంగు పడుద్దనే విషయం గుర్తుంచుకోవాలి. 

×