Newborn baby: శిశువును నోట్లో పెట్టుకుని లాక్కెళ్లిన కుక్క

అప్పుడే పుట్టిన శిశువును ఓ కుక్క నోట్లో పెట్టుకుని లాక్కెళ్లింది. దీంతో ఆసుపత్రి పార్కింగ్ వద్ద ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ కుక్కను తరిమారు. చివరకు శిశువును వదిలేసి ఆ కుక్క పారిపోయింది. అయితే, అప్పటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మహిళా చికిత్సాలయలో చోటుచేసుకుంది.

Newborn baby: శిశువును నోట్లో పెట్టుకుని లాక్కెళ్లిన కుక్క

Newborn baby

Newborn baby: అప్పుడే పుట్టిన శిశువును ఓ కుక్క నోట్లో పెట్టుకుని లాక్కెళ్లింది. దీంతో ఆసుపత్రి పార్కింగ్ వద్ద ఉన్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ కుక్కను తరిమారు. చివరకు శిశువును వదిలేసి ఆ కుక్క పారిపోయింది. అయితే, అప్పటికే ఆ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో మహిళా చికిత్సాలయలో చోటుచేసుకుంది.

ఈ ఘటన ఎలా చోటుచేసుకుందన్న విషయంపై పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఈ ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. ‘‘శిశువును నోట్లో పెట్టుకుని ఓ కుక్క ఆసుపత్రి పరిసరాల్లో తిరుగుతోందని మేము పోలీసులు సమాచారం అందించాం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు’’ అని మహిళా చికిత్సాలయ సూపరింటెండెంట్ డా.ఆశ వర్మ అన్నారు.

ఆ శిశువు మహిళా చికిత్సాలయలోనే జన్మించిందా? అన్న విషయంపై ఆ ఆసుపత్రి సిబ్బంది వివరాలు తెలపలేదు. శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఆ శిశువు తల్లిదండ్రులు ఎవరన్న విషయం కూడా గుర్తించలేకపోతున్నారు. తమ ఆసుపత్రిలో శిశువు జన్మించాక తల్లిదండ్రులకు అప్పగిస్తామని, ఆ తర్వాత శిశువు బాధ్యత అంతా వారిదేనని అక్కడి సిబ్బంది చెప్పారు. దీనిపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..