Adani Group: అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని ఆర్బీఐ, సెబీకి కాంగ్రెస్ లేఖ

అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్, సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్ మధాబి పూరీకి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ లేఖ రాశారు. వారిద్దరికి వేర్వేరు లేఖలు రాసి పలు విషయాలను పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ పరిశోధనలో తేలిన విషయాలపై సమగ్రంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు.

Adani Group: అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని ఆర్బీఐ, సెబీకి కాంగ్రెస్ లేఖ

AICC President election

Adani Group: అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ జరపాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్, సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్ మధాబి పూరీకి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ లేఖ రాశారు. వారిద్దరికి వేర్వేరు లేఖలు రాసి పలు విషయాలను పేర్కొన్నారు. హిండెన్ బర్గ్ పరిశోధనలో తేలిన విషయాలపై సమగ్రంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు.

ఏవైనా వైఫల్యాలు ఉంటే భారతీయ కార్పొరేట్ పై, దేశ ఆర్థిక నియంత్రకాలపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉంటుందని చెప్పారు. దీంతో అంతర్జాతీయంగా నిధులను రాబట్టడంలో భారత్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు.

అదానీ గ్రూప్ ఈక్విటీని ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వ సంస్థలు అంత భారీగా కొనాల్సిన అవసరం ఏమి వచ్చిందని జైరాం రమేశ్ నిలదీశారు. 30 కోట్ల భారతీయులు ఎల్ఐసీలో నమ్మకంతో సేవింగ్స్ చేసుకున్నారని, ఆ సంస్థ ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్ లో వేలాది కోట్ల రూపాయలు కోల్పోయిందని అన్నారు.

కాగా, అదానీ వ్యవహారంపై పార్లమెంటులో విపక్ష పార్టీలు చర్చకు ఎంతగా పట్టుబట్టినప్పటికీ దానిపై చర్చించేందుకు కేంద్ర సర్కారు అంగీకరించలేదన్న విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ పై చర్చిద్దామంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని విపక్ష పార్టీలు నిలదీశాయి.

Kishan Reddy: తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించండి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ