6 రాష్ట్రాల్లో.. రైల్వే స్టేషన్లు, దేవాలయాలను పేల్చేస్తాం

6 రాష్ట్రాల్లో.. రైల్వే స్టేషన్లు, దేవాలయాలను పేల్చేస్తాం

హర్యానాలోని రోహ్‌టక్ రైల్వే స్టేషన్‌కు జైషే మొహమ్మద్ ఉగ్రవాద క్యాంపు నుంచి బెదిరింపు లెటర్ అందింది. అక్టోబర్ 8నాటికల్లా ఆరు రాష్ట్రాల్లో ఉన్న గుడులు, రైల్వే స్టేషన్లను బాంబులతో పేలుస్తామని హెచ్చరికలు అందాయట. వాటిలో రోహిటక్, హిసార్, ముంబై, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా స్టేషన్లు ఉన్నాయట. 

హర్యానా రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం 3గంటలకు రోహ్‌టక్ రైల్వే స్టేషన్‌ సూపరిండెంట్‌కు ఆర్డినరీ పోస్టులో వచ్చింది. దాని ఫ్రమ్ అడ్రస్ పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చినట్లుగా ఉంది. దీంతో రివానీ రైల్వే స్టేషన్లో ఇప్పటి నుంచి భద్రతను పెంచారు. దాంతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లోనూ హెచ్చరికలు జారీ చేశారు. 

గతనెలలోనూ జైషే మొహమ్మద్ నుంచి దాడులు జరగనున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నేవీ చీఫ్ సైతం నీటి కింద ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. గుజరాత్ సర్ క్రీక్ ప్రాంతంలో నిషేదిత బోట్లు కనిపించడం అనుమానాలు తావిచ్చింది. ఆర్టికల్ 370తర్వాత భారత్ లోని భద్రతా బలగాలు మరింత జాగ్రత్తను పెంచాయి.