ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 09:12 AM IST
ఇన్నాళ్లు పొల్యూషన్ మనల్ని గుడ్డివాళ్లగా మార్చింది : మొదటిసారి హిమాచల్ పర్వతాలను చూస్తున్న జలంధర్ వాసులు

ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

దీంతో ఇన్నాళ్లు ఇబ్బడిముబ్బడిన రోడ్లపై తిరిగిన వాహనాలు అన్నీ ఒక్కసారిగా ఇళ్లల్లోనే ఉండిపవడంతో,ఇప్పటివరకు కంటికి కనిపించని పక్షలు ఇప్పుడు మన ఇళ్ల ముందుకొస్తున్నాయి. పలుచోట్ల అడవుల్లో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి.  లాక్ డౌన్ తో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పూర్తిగా తగ్గిపోయింది. భారత్ లో కూడా వాయు కాలుష్యం తగ్గి ఇప్పుడు కొంతమేరకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అందరికీ. అయితే వాయుకాలుష్యం భారత్ లో ఎంతలా తగ్గిందని చెప్పే ఫ్రూఫ్ గా ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

కొన్ని దశాబ్దాలుగా వాయు కాలుష్యం పెరిగిపోయిన కారణంగా పంజాబ్ లోని జలందర్ సిటీ వాసులకు…కేవలం 213కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ లోని దౌలాబార్ హిమాలయాల రేంజ్ కనిపించేది కాదు. అయితే ఇప్పుడు జలంధర్ సిటీ వాసులు దశాబ్దాల తర్వాత మళ్లీ…పూర్తిగా మంచుతో కప్పబడిన ఆ హిమాలయ పర్వత శ్రేణులను సృష్టంగా చూడగులుగుతున్నారు. దీంతో ప్రధానమంత్రి ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు జలంధర్ వాసులు.

దశాబ్దాలుగా చూడని తమకు దగ్గర్లోని హిమాలయ పర్వత శ్రేణులను ఇప్పుడు మళ్లీ సృష్టంగా చూస్తున్నామంటూ కొంతమంది జలంధర్ వాసులు తమ మిద్దెపై నుంచి తీసిన ఆ హిమాలయాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జలంధర్ వాసులు కొన్ని దశాబ్దాల చూడని దౌలాబార్ రేంజ్ ని మళ్లీ చూస్తురంటూ ఈ ఫొటోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ విధంగా పొల్యూషన్ మనల్ని అంధుల్ని చేసిదంటే ఆయన షేర్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. వేలసంఖ్యలలో లైక్ లు,రీట్వీట్ లు వస్తున్నాయి.

క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తన ఇంటిపై నుంచి తీసిన ఫొటోను ట్వీట్ చేశారు. జలంధర్ సిటీకి చెందిన చహత్ శర్మ లనే యువతి…వ్యూ నిజంగా చాలా అందంగా ఉంది. మొదటిసారిగా మేము ఈ వ్యూని ఇక్కడ చూశాం. ఈ వ్యూని చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Also Read | విశ్లేషణ: కరోనా కేసుల్లో ఇటలీని దాటిన స్పెయిన్. మరణాలు మాత్రం తక్కువే