గిన్నీస్ రికార్డు కోసం జల్లికట్టు : ప్రారంభించిన సీఎం పళని స్వామి

తమిళనాడు లో సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ రికార్డులోకి ఎక్కబోతోంది. ఒకే వేదికపై 2500 ఎద్దులు, వాటిని నిలువరించేందుకు 3 వేల మంది యువకులు పాల్గోనేందుకు తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాళీమలై లో ఆదివారం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పోటీలను సీఎం పళని స్వామి ప్రారంభించారు.

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 07:45 AM IST
గిన్నీస్ రికార్డు కోసం జల్లికట్టు : ప్రారంభించిన సీఎం పళని స్వామి

తమిళనాడు లో సాహాసక్రీడ జల్లికట్టు గిన్నీస్ రికార్డులోకి ఎక్కబోతోంది. ఒకే వేదికపై 2500 ఎద్దులు, వాటిని నిలువరించేందుకు 3 వేల మంది యువకులు పాల్గోనేందుకు తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాళీమలై లో ఆదివారం జల్లికట్టు నిర్వహిస్తున్నారు. పోటీలను సీఎం పళని స్వామి ప్రారంభించారు.

చెన్నై: తమిళనాడులోని  సంప్రదాయ సాహసక్రీడ జల్లికట్టు గిన్నీస్ బుక్ రికార్డును సాధించటానికి ప్రయత్నిస్తోంది. ప్రతి ఏటా సంక్రాంతి వస్తోందంటే తమిళనాడులో యువతకు జల్లికట్టు పేరు చెప్పగానే ఉత్సాహం ఉప్పోంగుతుంది. బుసలు కొట్టి బరిలోకిదిగిన ఎద్దులను అదుపు చేయటానికి ప్రాణాలు సైతం పణంగాపెట్టి సాహసోపేతంగా యువత ఈక్రీడలో పాల్గోంటారు. కొమ్ములు తిరిగి, బలీయమైన ఎద్దులను నిలువరించడానికి, వాటిని మచ్చిక చేసుకోవడానికి యువత పోటీపడే దృశ్యాలు కనువిందు చేస్తాయి. సాహసంతో కూడిన ఈ ఆటకు మంజు విరాట్టు అని కూడా పేరుంది. దీని అర్థం ఎద్దులను మచ్చిక చేసుకోవడం. స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్‌కు ఇది దగ్గరగా ఉంటుంది.
సుప్రీంకోర్టు  గైడ్ లైన్స్ ప్రకారం గిన్నీస్ బుక్ రికార్డు కోసం నిర్వహిస్తున్న అతి పెద్ద జల్లికట్టును పుదుక్కోటై జిల్లాలోని విరాళీమలైలో సీఎం పళణిస్వామి  ఆదివారం ప్రారంభించారు. ఈ పోటీల్లో  2500 ఎద్దులు, 3వేల మంది యువకులు పాల్గొంటున్నారు. ఈపోటీలను తిలకించేందుకు విదేశాలనుంచి సుమారు 250 మంది వచ్చారు. వివిధ రాష్టాల నుంచి మంత్రులను ప్రత్యేక ఆహ్వనితులుగా ప్రభుత్వం ఆహ్వానించింది. వైద్య ఆరోగ్యశాఖమంత్రి విజయ్ భాస్కర్ నియోజక వర్గంలోని గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఒకే వేదికపై 2,500 ఎద్దులు పాల్గోనటం, 3వేల మంది యువకువలు వాటిని అదుపు చేయటానికి ప్రయత్నించటం ఆధారంగా గిన్నిస్ రికార్డులో నమోదు  చేసుకోటానికి సంబంధిత ప్రతినిధులు గ్రామానికి  వచ్చారు. ఎద్దులను నిలువరించే యువకులకు కూడా విలువైన బహుమతులు ఏర్పాటు చేశారు. విరాళీమలైతోపాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది గ్రామస్తులు జల్లికట్టు తిలకించేందుకు గ్రామానికి చేరుకున్నారు. ఒక డీఐజీ స్ధాయి అధికారితో పాటు 4గురు ఎస్ పీలు,25 మంది డీఎస్పీలు 40 మంది ఎస్ ఐలుతో  సహా 1000 మంది పోలీసులతో  భద్రత ఏర్పాటు చేశారు. పోటీలు కొనసాగుతున్నాయి.