Jallikattu : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. కరోనా నిబంధనలను పట్టించుకోని నిర్వాహకులు

కోడెగిత్తలతో యువకులు సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తోంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తోంది.

Jallikattu : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. కరోనా నిబంధనలను పట్టించుకోని నిర్వాహకులు
ad

Jallikattu Competitions in Tamil Nadu : తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. పాలమేడు, తిరుచ్చి, అవనీయపురంలో కోడెగిత్తలు రంకెలేస్తున్నాయి. యువకులపై కొమ్ములతో విరుచుకుపడుతున్నాయి. పొట్లగిత్తల దూకుడుతో పలువురికి గాయాలవుతున్నాయి. అయినా అదురు లేదు.. బెదురు లేదు.. అంతకుమించి తగ్గేది లేదంటున్నారు యువకులు. బరిలోకి రా తేల్చుకుందామంటున్నారు. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తున్నారు. తమ పౌరుషాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎద్దును లొంగదీసుకునేందుకు వందలాది యువకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఇక కోడెగిత్తలతో సమరానికి కుర్రాళ్లు కాలుదువ్వారు యువకులు. ఎంతకూ లొంగని ఎద్దు దొరికినవాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తోంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తోంది. పదునైన కొమ్ములతో విరుచుకుపడుతోంది. ఆట మొదలైన కాసేపటికే కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. ఇక నిన్న మధురై జిల్లాలో జల్లికట్టులో యువకుడి మృతి చెందారు. దీంతో పోటీలకు దగ్గరలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

CM KCR : బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ప్రచారం..?

మరోవైపు వరుసగా రెండో రోజు కూడా కరోనా నిబంధనలు భేఖాతరు చేస్తున్నారు నిర్వహకులు. మధురై జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. తమిళ సర్కార్‌ విధించిన నిబంధనలు అసలు అమలు కావడం లేదు. జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంది. అటు పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్ధానికి మించకూడదు.

అయితే వందల సంఖ్య దాటి వేల సంఖ్యలో ప్రజలు పోటీలను చూసేందుకు తరలివస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. ఎవరు ఆగడం లేదు. కనీస భౌతిక దూరమన్నది మరిచారు. మాస్కులు అసలే లేవు. ఇలా కరోనా నిబంధనల ఉల్లంఘన మధ్యే పోటీలు జోరుగా సాగుతున్నాయి.