రాజకీయాలకు షా గుడ్ బై

  • Published By: venkaiahnaidu ,Published On : August 10, 2020 / 06:52 PM IST
రాజకీయాలకు షా గుడ్ బై

ఐఏఎస్​ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్​… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్​ ఐఏఎస్​ అధికారి షా ఫైజల్​.. జమ్ముకశ్మీర్​ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకాశాలు కనపడుతున్నాయి. గతేడాది ఫైజల్​ ఇచ్చిన రాజీనామా లేఖను ఇంకా ఆమోదించలేదని ప్రభుత్వం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.



2010లో సివిల్స్​ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సొంత రాష్ట్రంలో పోస్టింగ్​ పొందారు ఫైజల్. నిజాయితీపరుడిగా పేరు సంపాదించారు.ఆర్టికల్​ 370 రద్దు సమయంలో కశ్మీర్​లోని అనేకమంది నేతలతో పాటు ఫైజల్​ను కూడా ప్రజా భద్రత చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జూన్​లో ఫైజల్​ విడుదలైన విషయం తెలిసిందే.



ఏళ్ల పాటు జమ్ముకశ్మీర్​ ప్రభుత్వంలో సేవలు అందించిన ఐఏఎస్​ అధికారి షా ఫైజల్… ​ గతేడాది విధుల నుంచి తప్పుకున్నారు. 2019 ఆరంభంలో రాజకీయ అరంగేట్రం చేసి… జమ్ముకశ్మీర్​ పీపుల్స్​ మూవ్​మెంట్​(జేకేపీఎమ్​)ను స్థాపించారు. కశ్మీర్ యువతకు జేకేపీఎమ్​ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలుస్తుందని పదేపదే చెప్పారు.



అయితే రాజకీయాల్లో ఆయన విజయం సాధించలేకపోయారు. జేకేపీఎమ్​ను ఏర్పాటు చేసినప్పటికీ.. ఇన్ని నెలలుగా ఫైజల్​ పేరు ప్రభుత్వ అధికారిక వైబ్​సైట్​లోని ఐఏఎస్​ అధికారుల జాబితాలో కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ఆయన రాజీనామాను ఆమోదించలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన తిరిగి విధుల్లో చేరవచ్చని సంకేతాలిచ్చాయి. ఈ వార్తలకు ఊతమందిస్తూ తన ట్విట్టర్​ బయోను పూర్తిగా మార్చేశారు ఫైజల్. జేకేపీఎమ్​ వ్యవస్థాపకుడన్న విషయాన్ని డిలీట్ చేశారు.