ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

  • Published By: vamsi ,Published On : May 25, 2020 / 07:04 AM IST
ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటే.. జమ్మూ-కశ్మీర్‌లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఇద్దరు ముష్కరులు హతం అయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా హింజిపొర ప్రాంతంలోని దమ్‌హాల్‌ గ్రామంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే వారు ఏ ఉగ్రముఠాకు చెందినవారో ఇంకా గుర్తింలేదు. ఇంకా అక్కడే మరికొందరు ముష్కరులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది.

ఇటీవలే హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ఇద్దరు కీలక ముష్కరుల్ని హతమార్చింది భారత సైన్యం. వీరిలో ఒకడు కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడి కుమారుడు. అంతకు ముందు హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నైకూను సైన్యం మట్టుబెట్టింది.

Read: వలస కూలీల కష్టం తీరాకే ఇంటి కెళతా..