గన్స్ పట్టుకోవడమే కశ్మీర్ యువతకి ఉన్న ఆఫ్షన్

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2020 / 03:07 PM IST
గన్స్ పట్టుకోవడమే కశ్మీర్ యువతకి ఉన్న ఆఫ్షన్

mehbooba mufti:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ యువతకి చేతుల్లో గన్స్ తీసుకోవడం తప్ప వేరే ఆఫ్షన్ లేదంటూ సోమవారం(నవంబర్-9,2020)ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువతకి ఉద్యోగాలు లేవని,తుపాకులు చేతబట్టడం తప్ప యువతకి వేరే మార్గం లేదన్నారు. టెర్రర్ రిక్రూట్ మెంట్ పెరిగిందని ముఫ్తీ అన్నారు.



ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూకశ్మీర్ లో ఉద్యోగాలు పొందుతున్నారని ఆమె విమర్శించారు. మోడీ ప్రభుత్వం…వాజ్ పేయి సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరముందని ముఫ్తీ వ్యాఖ్యానించారు. యువత తీవ్ర నిరాశలో ఉన్నట్లు ముఫ్తీ తెలిపారు. జమ్మూ పరిస్థితి అయితే కశ్మీర్ కన్నా దారుణంగా ఉందని ముఫ్తీ అభిప్రాయపడ్డారు.



https://10tv.in/up-minister-manohar-lal-controversial-comments-girls-should-carry-knife-for-self-defence-and-use-if-needed/
ఆర్టికల్ 370రద్దుపై మాట్లాడిన ముఫ్తీ…జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగుతుందనే కండీషన్ పైనే తాము భారత్ తో కలిశామని ముఫ్తీ అన్నారు. తమ భూమి,ఉద్యోగాలు,ఇతర విషయాలన్నీ కశ్మీర్ వ్యాలీ ప్రజలకే కానీ ఇతరులకు కాదని ముఫ్తీ అన్నారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత చీకట్లు కశ్మీర్ వ్యాలీని అదేవిధంగా జమ్మూని కప్పేశాయని ముఫ్తీ అన్నారు. జమ్మూకశ్మీర్ ఘర్ణకు కారణం కాకుడదని,కానీ భారత్-పాక్ ల మధ్య ఓ బ్రిడ్జ్ లా ఉండాలన్నదే తమ పార్టీ వైఖరి అని ముఫ్తీ తెలిపారు.