Jammu Kashmir : గాయపడిన సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లి..కూలిపోయిన సైనిక హెలికాప్టర్..పైలట్ మృతి

గాయపడిన సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.

Jammu Kashmir : గాయపడిన సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లి..కూలిపోయిన సైనిక హెలికాప్టర్..పైలట్ మృతి

Army Helicopter Crashes Near Gurez Sector

Army helicopter crashes near Gurez sector : జమ్ము కశ్మీర్ లోని గురెజ్ సెక్టార్లోని గుజ్రన్ నల్లా ప్రాంతంలో శుక్రవారం (మార్చి 11,2022)భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. గురెజ్ ప్రాంతంలో గాయపడిన ఓ సైనికుడ్ని తీసుకురావటానికి వెళ్లిన చీతా హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక వెనుదిరిగింది. వెనుతిరిగిన కాసేపటికే ఆ హెలికాప్టర్ ఎల్ఓసీ వద్ద ప్రమాదానికి గురై కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Also read : Punjab:‘‘మనం ఏం విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది..ఓడాక కావాల్సింది చింత కాదు చింతన‘‘ కాంగ్రెస్ పై సిద్ధూ చురకలు

ప్రమాదానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదని సైనికాధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు ఘటన స్థలికి కాలినడకను పయనమయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమో వెదికేందుకు ప్రత్యేక బృందాలు ఏరియల్ సర్వే చేపడుతున్నాయి.

Also read : Locked down in China : చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్..మరోసారి లాక్ డౌన్..స్కూల్స్ మూసివేత

సైన్యంలో ఎన్నో సంవత్సరాలు సేవలు అందిస్తున్న చీతా, చేతక్ హెలికాప్టర్లను మార్చి కొత్త హెలికాప్టర్లతో భర్తీ చేయాలంటూ గతంలో ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటిని నావల్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్ యూహెచ్), రష్యా తయారీ కేఏ 226టీ హెలికాప్టర్లతో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.