Jammu&kashmir ‘Bindaas,Dare devil’ Cop : ఉగ్రవాదులను హతమార్చి అమరుడైన కానిస్టేబుల్’కు ‘శౌర్యచక్ర’..

‘వెన్ను చూపని వీరులు’ మన భారత జవాన్లు. టెర్రరిస్టులు మానవ బాంబులుగా మారి ఎదురొస్తున్నా వెన్ను చూపక..మమ్మల్ని దాటుకుని నా దేశంవైపు చూడు అనే గుండె ధైర్యం గల మన ఆర్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గుండె నిండా చెదరని సాహసం..విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి నిలిచి ముష్కరుల్ని అంతం చేసిన పోలీస్ కానిస్టేబుల్ మదాసిర్‌ అహ్మద్‌ షేక్‌  గుండె ధైర్యానికి కేంద్ర ప్రభుత్వం ‘శైర్య చక్ర’అవార్డును బహూకరించింది.

Jammu&kashmir ‘Bindaas,Dare devil’ Cop : ఉగ్రవాదులను హతమార్చి అమరుడైన కానిస్టేబుల్’కు ‘శౌర్యచక్ర’..

Jammu and Kashmir Police personnel Mudasir Ahmad Sheikh Shaurya Chakra award.

Jammu and kashmir ‘Bindaas,Dare devil’ Cop : ‘వెన్ను చూపని వీరులు’ మన భారత జవాన్లు. టెర్రరిస్టులు మానవ బాంబులుగా మారి ఎదురొస్తున్నా వెన్ను చూపక..మమ్మల్ని దాటుకుని నా దేశంవైపు చూడు అనే గుండె ధైర్యం గల మన ఆర్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కశ్మీర్ అంటేనే అత్యంత భయానక పరిస్థితుల్లో పనిచేసే ప్రాంతం. అక్కడ నిరంతరం దేశం కోసం పోరాడే సైనికులు ఎంత గొప్పవారో కశ్మీర్ లో పనిచేసే పోలీసులు కూడా వారికి ఏమాత్రం తీసిపోరు. ప్రమాదం పాము పడగ ఎత్తి బుస కొడుతున్నా మోముపై చెరగని దరహాసం…గుండె నిండా చెదరని సాహసం..విపత్కర పరిస్థితుల్లోనూ ఎదురొడ్డి లిచి ముష్కరుల్ని అంతం చేసిన పోలీస్ కానిస్టేబుల్ మదాసిర్‌ అహ్మద్‌ షేక్‌  గుండె ధైర్యానికి కేంద్ర ప్రభుత్వం ‘శైర్య చక్ర’అవార్డును బహూకరించింది.

మాతృభూమి రక్షణలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించేంత ఆ సాటిలేని త్యాగానికి ఎంత ఇచ్చినా తక్కువే. ఏమిచ్చినా స్వల్పమే. కానీ అతని త్యాగానికి గుర్తంచటం మనల్ని మనం గౌరవించుకున్నట్లే..అటువంటి ఓ అసాధారణ ధైర్య శాలి..ఉగ్రవాదంపై పోరులో అసాధారణ ప్రతిభాపాటవాలను ప్రదర్శించి ముష్కరుల బృందాన్ని మట్టుబెట్టిన జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ మదాసిర్‌ అహ్మద్‌ షేక్‌..ముష్కరుల్ని మట్టు పెట్టే క్రమంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అహ్మద్ షేక్ కు భారత 74వ గణతంత్ర దినోత్సవం రోజున శౌర్యచక్రను బహూకరించింది కేంద్ర ప్రభుత్వం.  దేశం కోసం అహ్మద్ త్యాగానికి..ధైర్యసాహసాలకు గుర్తింపుగా శాంతి సమయంలో ప్రదానం చేసే మూడో అత్యున్నత పురస్కారం అయిన ‘శౌర్య చక్ర’ను బహూకరించింది.

బారాముల్లాలోని యురికి చెందిన కానిస్టేబుల్‌ అహ్మద్ షేక్‌ అలియాస్‌ బిందాస్‌.. కరడుగట్టిన ముగ్గురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను హతమార్చడంలో అత్యంత క్రియాశీల పాత్ర నిర్వహించారు. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం అందుకున్న భారత సైన్యం వారిని మట్టు పెట్టాలని 2022 మే 25న ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఒక చెక్‌పోస్టు వద్ద పోలీసులను గమనించిన ఉగ్రవాదులు కారులో ప్రయాణిస్తూనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. వారిపై భద్రతా బలగాలు ఎదురు దాడి చేస్తూ కాల్పులు జరిపారు.

ఆ సమయంలో కానిస్టేబుల్‌ అహ్మద్‌ షేక్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ముగ్గురు ముష్కరులను అంతమొందించాయి. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరుల్ని అంతం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అమ్మద్ షేక్. అధికరణం 370 రద్దు తర్వాత తొలిసారి గత ఏడాది 2022 అక్టోబరు 5న జమ్మూకశ్మీర్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా… కానిస్టేబుల్‌ అహ్మద్‌ షేక్‌ కుటుంబ సభ్యులను స్వయంగా కలిశారు. అహ్మద్ షేక్ సమాధి వద్ద నివాళులర్పించారు. శౌర్యచక్ర అవార్డును ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు.

అలా దేశం కోసం పాటు పడిన ఆరుగురు సైనిక వీరులకు కీర్తి చక్ర పురస్కారాలు, వీరిలో నలుగురు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాలకు ఎంపికయ్యారు. 15 మంది సైనికవీరులకు శౌర్య చక్ర పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఇద్దరు మరణానంతరం శౌర్య చక్రకు ఎంపియ్యారు. 92 సేనా మెడల్స్, ఒక నావ్ సేనా మెడల్, 7 వాయు సేనా మెడళ్లు, 29 పరమ్ విశిష్ట్ సేవా మెడల్స్ సహా మొత్తం 412 గ్యాలంట్రీ పురస్కారాలను ప్రధానం చేశారు.