అనుపమ కాదు.. బుమ్రా కాబోయే భార్య ఈమేనా..?

అనుపమ కాదు.. బుమ్రా కాబోయే భార్య ఈమేనా..?

Jasprit Bumrahs wedding with Sanjana Ganesan: భారత జట్టు పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. మార్చి 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. కొద్దిమంది బంధుమిత్రులకు మాత్రమే పెళ్లి వేడుకకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

కాగా, బుమ్రాకు కాబోయే భార్య ఎవరనే విషయంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నటి అనుపమ పరమేశ్వరన్ ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. కాగా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బుమ్రా పెళ్లాడబోయేది అనుపమను కాదని తేలింది. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను బుమ్రా తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడని తాజా సమాచారం. సంజనా, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తోంది.

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు బుమ్రా అనూహ్యంగా వ్యక్తిగత కారణాలతో బీసీసీఐ నుంచి సెలవులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడికి వివాహం కుదిరిందనే వార్తలొచ్చాయి. దానికి తోడు దక్షిణాది సినీ తార అనుపమ పరమేశ్వరన్‌తో వివాహం జరగబోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని అనుపమ కుటుంబసభ్యులు కొట్టిపారేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి బుమ్రా పెళ్లి వార్త ఆసక్తి రేపింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక ఇంగ్లాండ్‌తో వన్డేలకు బుమ్రా దూరమైనట్లే. ఆపై నేరుగా ఐపీఎల్‌ 2021 సీజన్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.