పుల్వామా దాడి ఓ కుట్ర…ప్రభుత్వం మారితే పేర్లు బయటికొస్తాయి

పుల్వామా దాడి ఓ కుట్ర…ప్రభుత్వం మారితే పేర్లు బయటికొస్తాయి

పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్‌గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు.
Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు – హర్షకుమార్

గురువారం(మార్చి-21,2019) హోలీ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ….పుల్వామా దాడి వెనుక నిజం ఏమిటనే దానిపై విచారణ జరగాల్సి ఉందన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం మారి ఈ ఘటనపై విచారణ జరిగితే చాలా పెద్ద నేతల పేర్లుబయటకు వస్తాయని అన్నారు. మోడీ ప్రభుత్వం పట్ల పారామిలటరీ బలగాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. జమ్మూ- శ్రీనగర్ మధ్యలో ఎలాంటి తనిఖీలు లేవని,జవాన్లు సాధారణ బస్సులలో తరలించబడ్డారని,ఇదొక పెద్ద కుట్ర అని రామ్ గోపాల్ అన్నారు.

రామ్ గోపాల్ చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను తక్కువచేసి మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.2019,ఫిబ్రవరి-14న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read Also : మెగా బ్రదర్స్ గట్టెక్కేనా : వెస్ట్ గోదావరి ఎందుకు ?