బీజేపీ లీడర్లు ఎన్నికల్లో గెలవాలంటే రైతుల ఆందోళనలో పాల్గొనండి

రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) లీడర్ జయంత్ చౌదరి గురువారం కొత్తగా ఏర్పడిన మూడు చట్టాల గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే.. రైతు ఆందోళనలో..

బీజేపీ లీడర్లు ఎన్నికల్లో గెలవాలంటే రైతుల ఆందోళనలో పాల్గొనండి

Jayant Chaudhary : రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) లీడర్ జయంత్ చౌదరి గురువారం కొత్తగా ఏర్పడిన మూడు చట్టాల గురించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే.. రైతు ఆందోళనలో పాల్గొనాలి. అని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించారు. బులంద్‌షార్ జిల్లా జహంగిరాబాద్ పట్టణానికి చెందిన కిసాన్ పంచాయత్ వేదికగా మాట్లాడారు.

నాలుగు నెలల రైతు ఆందోళన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. ఈ తీరును బ్రేక్ చేయాలంటే ఇన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో కచ్చితంగా పాల్గొనాలి. అలా వారందరితో కలిస్తే మాత్రమే బీజేపీకి ఓట్లు వస్తాయి. ఈ ఎఫెక్ట్ బీజేపీ పోస్టర్ల మీద కూడా కనబడుతుంది. చౌదరి చరణ్ సింగ్, రైతు లీడర్లు ఫొటోలలో ఇప్పటికే వాడేస్తున్నారు.

పీఎం మోడీ ఒక ఆందోళన్‌జీవి. తిండి పెట్టిన వాళ్ల రక్తం తాగాలని ఎవరూ అనుకోరు.. పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయాన్ని, రైతులను నాశనం చేస్తున్నారు. రైతులకు మేలు కలుగుతుందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

మా యుద్ధం రైతులను, వ్యవసాయాన్ని కాపాడాలనే. కార్పొరేట్ లకు అనుకూలంగా అవి ఏర్పాటు చేశారు. అవి రద్దు చేసి, కనీస మద్ధతు ధర ప్రకటించేంత వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది.