ఉమెన్స్ కాలేజ్‌లో బురఖాపై నిషేధం : వేసుకొస్తే ఫైన్ కట్టాల్సిందే

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 07:22 AM IST
ఉమెన్స్ కాలేజ్‌లో బురఖాపై నిషేధం : వేసుకొస్తే ఫైన్ కట్టాల్సిందే

ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు బుర్ఖా వేసుకుని రావటానికి వీల్లేదంటూ బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని జేడీ ఉమెన్స్ కళాశాల యాజమాన్యం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. జేడీ ఉమెన్స్ కాలేజీలకు వచ్చే విద్యార్థినులందరూ నిర్దేశిత డ్రెస్ కోడ్ పాటించాలని, కళాశాలలో బుర్ఖా ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ఈ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొక్టర్‌ల సంతకాలతో నోటీసు బోర్డు పెట్టారు. 

ఈ అంశంపై కాలేజీ ప్రిన్సిపల్ వీనా అమృత్ మాట్లాడుతూ..మా కాలేజీకి ఇప్పటికే యూనిఫాం ఉందనీ..అందరూ సమానమేనని యూనిఫాంను మలుచేస్తున్నామనీ..అందుకే కళాశాలలో బుర్ఖా ధరించడాన్ని నిషేధించామని తెలిపారు. శనివారం తప్ప మిగతా రోజుల్లో విద్యార్థినులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆ నోటీసులో తెలిపారు.

డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన విద్యార్థినికి 250 రూపాయల జరిమానా విధిస్తామని ప్రిన్సిపాల్ జారీ చేసిన నోటీసులో హెచ్చరించారు. అంతేకాదు క్లాస్ రూమ్ లో మొబైల్ వాడితే రూ. 500లు జరిమానా విధిస్తామని తెలిపారు.