JEE Main Result : జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల

దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి.

JEE Main Result : దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ ) విడుదల చేసింది. అధికారిక  వెబ్ సైట్ https//jeemain.nta.nic.in/లో అందుబాటులో ఉంచారు. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పలు తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ తొలి విడత పరీక్ష నిర్వహించారు. జనవరి 24 ,25, 28, 29,30,31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష సెషన్-1 నిర్వహించారు. ఈ పరీక్షలకు 8.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Architecture Courses : ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

జేఈఈ మెయిన్ పేపర్ 1కు మొత్తం 8.6 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2.6 లక్షల మంది విద్యార్థినులు, 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, 8.22 లక్షల మంది విద్యార్థులు పరీక్షు హాజరయ్యారు.

ఎన్ టీఏ అధికారిక వెబ్ సైట్ లో త్వరలో జేఈఈ మెయిన్స్ పరీక్షల టాపర్స్ జాబితాను కూడా విడుదల చేయనుంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరుగున్నాయి.

ట్రెండింగ్ వార్తలు