మా జీతాలు ఇప్పించండి…రాష్ట్రపతి,ప్రధానికి జెట్ ఉద్యోగుల లేఖ

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2019 / 12:27 PM IST
మా జీతాలు ఇప్పించండి…రాష్ట్రపతి,ప్రధానికి జెట్ ఉద్యోగుల లేఖ

జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు.జెట్ తమకు చెల్లించాల్సిన జీతాలకు సంబంధించిన వ్యవహారంలో అదేవిధంగా జెట్ కు ఎమర్జెన్సీ ఫండ్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోవింద్,మోడీలకు రాసిన లేఖల్లో జెట్ ఉద్యోగులు కోరారు. రుణదాతలు ఎమర్జెన్సీ ఫండ్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జెట్ తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.జెట్ కొన్ని నెలలుగా తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేదు.పైలెట్లకు కూడా జీతాలు చెల్లించలేదు.ఈ క్రమంలోనే రెండు ఎంప్లాయిన్ యూనియన్లు ప్రెసిడెంట్,ప్రధానికి లేఖలు రాశాయి.
Also Read : నవ్వు ఆగదు : ఫొటోకి ఫోజులిస్తూ నదిలో పడిపోయిన దంపతులు

 ది సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్(SWIP),జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మెయిన్ టెనెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(JAMEWA) జెట్ చెల్లించాల్సిన ఉన్న జీతాలకు సంబంధించి లేఖలు రాశారు. జెట్ తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 23వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.జెట్..కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నికల్ స్టాఫ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో జెట్ ఉద్యోగులను ఆదుకునేందుకు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చింది. తమ సంస్థలో తొలి ప్రాధాన్యం జెట్ సిబ్బందికే  ఇస్తామంటూ 500 మందికి జాబ్ ఆఫర్ చేసింది.
Also Read : వీడియో వైరల్: రాంగ్‌రూట్‌లోకి వచ్చి.. ఎలా బెదిరిస్తున్నారో చూడండి..