Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..

ఓ యువకుడు బాలికను దారుణంగా కాళ్లతో తంతూ ఉరికించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలిక కిందపడినప్పటికీ కాళ్లతో తంతూనే ఉన్నాడు.. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వీడియో కాస్త సీఎం హేమంత్ సొరెన్ దృష్టికి వెళ్లడంతో యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను...

Viral video: గిరిజన బాలికను కాళ్లతో తంతూ రెచ్చిపోయిన యువకుడు.. సీఎం ఫైర్.. యువకుడు అరెస్ట్..

Jharkhand

Viral video: ఓ యువకుడు బాలికను దారుణంగా కాళ్లతో తంతూ ఉరికించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలిక కిందపడినప్పటికీ కాళ్లతో తంతూనే ఉన్నాడు.. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ వీడియో కాస్త సీఎం హేమంత్ సొరెన్ దృష్టికి వెళ్లడంతో యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలో ఉన్న యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా జిల్లాలో యూనిఫాంలో ఉన్న బాలికను పొలంలోకి తీసుకెళ్లి ఓ యువకుడు దారుణంగా కాళ్లతో తన్నాడు. బాలిక కిందపడినప్పటికీ కాళ్లతో తంతూనే దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న కొందరు సెల్ పోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్విట్ చేయడంతో అది కాస్త సీఎం హేమంత్ సోరెన్ దృష్టికి వెళ్లింది. బాలికపై యువకుడు దారుణంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో క్లిప్ ఆధారంగా పాఠశాల యూనిఫాంలో ఉన్న బాలిక దుమ్కా జిల్లా పాకూర్ లోని సెయింట్ స్టానిస్లాస్ హెచ్. ఎస్. హతిమారా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. విద్యార్థిని విచారించిన పోలీసులు.. కాళ్లతో తన్నింది రోలమారా గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

Viral video: 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు.. సగం దూరం ఎక్కగానే..

దుమ్కా పోలీసులు ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారని పాకూర్ ఎస్పీ హృదీప్ పి. జనార్దనన్ తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఇది ప్రేమ వ్యవహారమేనని దుమ్కా సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డిపిఓ) నూర్ ముస్తఫా అన్సారీ తెలిపారు. ఈ సంఘటన పది రోజుల క్రితం జరిగిందని, అయితే వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ గిరిజన వర్గానికి చెందినవారేనని, వారిని విచారణ కోసం గోపికందర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. బాలుడు మైనర్ కావడంతో రిమాండ్ హోమ్‌కు పంపడం జరుగుతుందని అన్సారీ తెలిపారు.