జార్ఖండ్ లో ఏప్రిల్-29వరకు కంప్లీట్ లాక్ డౌన్

కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జార్ఖండ్ లో ఏప్రిల్-29వరకు కంప్లీట్ లాక్ డౌన్

Jharkhand

Jharkhand కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-22 ఉదయం 6గంటల నుంచి ఏప్రిల్-29ఉదయం 6గంటల వరకు రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం(ఏప్రిల్-20,2021)ప్రకటించారు. అయితే లాక్ డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

ప్రార్థనామందిరాలు తెరిచే ఉంటాయని,కానీ ప్రార్థనామందిరాల్లోకి ఎవరినీ అనుమతించట్లేదని సీఎం చెప్పారు. కరోనా వైరస్ చైన్ ని బ్రేక్ చేయడానికి లాక్ డౌన్ తప్పనిసరి అయిందని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఇక, జార్ఖండ్ లో సోమవారం నాటికి కరోనా మరణాల సంఖ్య 1456,కేసుల సంఖ్య 1,62,945కి చేరింది. సోమవారం నాటికి రాష్ట్రంలో 28,010యాక్టివ్ కరోనా కేసులు ఉండగా,కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,33,479కి చేరింది.