Corona Vaccine Wastage: కోవిడ్‌ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్‌ టాప్‌

కోవిడ్ టీకా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ఏ రాష్ట్రం ఎంతమేర కోవిడ్ వ్యాక్సిన్ ను వృథా చేశాయి అనే విషయాలు వెల్లడించింది. వ్యాక్సిన్ ను అధికంగా వృథా చేసిన రాష్ట్రాల్లో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది. జార్ఖండ్ 33.95 శాతం టీకాలు వృథా చేసినట్లు రిపోర్ట్ లో తెలిపారు.

Corona Vaccine Wastage: కోవిడ్‌ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్‌ టాప్‌

Corona Vaccine Wastage

Corona Vaccine Wastage: కోవిడ్ టీకా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ఏ రాష్ట్రం ఎంతమేర కోవిడ్ టీకా డోసులను వృథా చేశాయి అనే విషయాలు వెల్లడించింది. టీకా డోసులను అధికంగా వృథా చేసిన రాష్ట్రాల్లో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది. జార్ఖండ్ 33.95 శాతం డోసులను వృథా చేసినట్లు రిపోర్ట్ లో తెలిపారు. ఇక ఆ తర్వాత స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లో 15.79 శాతం డోసులు, మధ్యప్రదేశ్‌లో 7.35 శాతం డోసులు వృథా అయ్యాయి. పంజాబ్‌లో 7.08 శాతం, ఢిల్లీలో 3.95 శాతం, రాజస్తాన్‌లో 3.91 శాతం డోసులు వృథా అయ్యాయి.

మే నెలలో మొత్తంగా కేంద్రప్రభుత్వం 7.9 కోట్ల డోస్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. మే నెలలో కేంద్ర రాష్ట్రాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్ డోసులలో ప్రస్తుతం 2.1 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇక వ్యాక్సినేషన్ సమర్థవంతంగా చేపట్టిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా, కేరళ రెండవస్థానంలో ఉంది.

అయితే వ్యాక్సిన్ వృథాపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పాత లెక్కలను పరిగణలోకి తీసుకుందని తెలిపారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణి మందకొడిగా సాగిన సమయంలో 4.5 శాతం డోసులు వృథా జరిగిందని, వ్యాక్సిన్ పంపిణి పుంజుకున్న తర్వాత అది 1.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. వ్యాక్సిన్ విషయమై కేంద్ర పెద్దలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో అనేక సార్లు ఇదే విషయం చెప్పానని, కానీ వారు పాత డేటా తీసుకోని రిపోర్ట్ విడుదల చేశారని తెలిపారు.